బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: ‘వర్క్ ఫ్రం హోం’ ప్లాన్ పొడిగింపు

By Sandra Ashok Kumar  |  First Published May 26, 2020, 11:29 AM IST

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల్లో ‘వర్క్ ఫ్రం హోం’ నిపుణులకు నెలవారీ ప్రమోషన్ ప్లాన్ వచ్చేనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 600 రోజుల దీర్ఘ కాలిక ప్లాన్ వివరాలను కూడా వెల్లడించింది. 
 


న్యూఢిల్లీ: కరోనా ‘లాక్‌డౌన్’ వేళ ‘వర్క్ ఫ్రం హోం’  విధులు నిర్వర్తిస్తున్న తమ ల్యాండ్‌లైన్ ఖాతాదారులకు బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘వర్క్ ఫ్రం హోం’ ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

నెల రోజుల ప్రమోషనల్ ప్లాన్‌లో భాగంగా మార్చిలో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత దీనిని మే 19 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోమారు జూన్ 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేని బీఎస్‌ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 

Latest Videos

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వర్క్ ఫ్రం హోం’ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు బీఎస్ఎన్ఎల్ దీనిని తీసుకొచ్చింది. అండమాన్ నికోబార్ దీవులు మినహా దేశవ్యాప్తంగా అందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 

ఈ ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు 10 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగం 5జీబీ వరకు లభిస్తుంది. ఆ తర్వాత వేగం ఒక ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అలాగే ఒక ఈ-మెయిల్ ఐడీ 1జీబీ స్టోరేజీతో లభిస్తుంది.

also read ప్రముఖ టెక్‌ కంపెనీలో ఉద్యోగులపై వేటు...వేలాదిమంది ఇంటికి... ...

ఈ ప్లాన్‌లో ఎలాంటి ఇన్‌స్టాలేషన్ చార్జీలు కానీ, సెక్యూరిటీ డిపాజిట్లు కానీ ఉండవు. అయితే, ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు సొంత మోడెమ్ కానీ, ప్రెమిస్ ఎక్విప్‌మెంట్ (సీపీఈ) కానీ కలిగి ఉండాలి. 

బీఎస్ఎన్ఎల్ మరోవైపు రూ.2,399తో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. చత్తీస్‌గఢ్ ట్విట్టర్ ఖాతా ద్వారా బీఎస్ఎన్ఎల్ ఈ ప్రకటన చేసింది. ఈ ప్లాన్ కాలపరిమితి 600 రోజులు. ఇందులో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. రోజుకు 250 నిమిషాల టాక్‌టైం లభిస్తుంది. 

దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌లో తొలి 60 రోజులు బీఎస్ఎన్ఎల్ ట్యూన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఏ డేటా ప్రయోజనాలు ఉండవు కాబట్టి డేటా కోసం అదనంగా యాడ్ ఆన్ ప్యాక్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 

click me!