ప్రముఖ టెక్‌ కంపెనీలో ఉద్యోగులపై వేటు...వేలాదిమంది ఇంటికి...

By Sandra Ashok KumarFirst Published May 25, 2020, 4:53 PM IST
Highlights

 ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) కఠినమైన క్లిష్ట  పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను తొలగించనున్నట్లు శుక్రవారం అర్థరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ధృవీకరించింది. 
 

శాన్ఫ్రాన్సిస్కో: గ్లోబల్ టెక్ కంపెనీ అరవింద్ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) కఠినమైన క్లిష్ట  పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను తొలగించనున్నట్లు శుక్రవారం అర్థరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ధృవీకరించింది. 

"ఈ వ్యాపార నిర్ణయం మా ఉద్యోగులలో కొంతమందికి కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబిఎం సబ్సిడీతో కూడిన వైద్య కవరేజీని అందిస్తోంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

హ్యూలెట్-ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ (హెచ్‌పిఇ), ఐబిఎం రెండూ గణనీయమైన ఖర్చును  తగ్గించే చర్యలను ప్రకటించాయి, వీటిలో వేతన కోతలు, గణనీయమైన ఉద్యోగుల తొలగింపులు ఉన్నాయి.

also read 

ఐబిఎం సంస్థ ఉద్యోగుల తొలగింపుపై  ఎంత మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించలేదు కాని మీడియా నివేదికల ప్రకారం వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య స్థాయి ఉద్యోగులపై వేటు వేయనుంది.  

అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాల్లో వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వీరిలో భారతదేశంలో కొన్ని వందల ఉద్యోగులు కూడా ప్రభావితం కానున్నారు.  బాధిత ఉద్యోగులకు మూడు నెలల  వేతనాన్ని  చెల్లించనుంది.

హెచ్‌పి‌ఈ సంస్థ దాని ఇటీవలి త్రైమాసిక ఆదాయ నివేదికలో భాగంగా కాస్ట్ కటింగ్ ప్లాన్లను ప్రకటించింది. అలాగే అక్టోబర్ 31 వరకు కంపెనీ అధికారులు వేతనాల నుండి 20 నుండి 25 శాతం కోత విధించనుంది. ఈ సంస్థ 2018 లో రెడ్ హ్యాట్ ను 34 బిలియన్లకు కొనుగోలు చేసింది.
 

click me!