మొబైల్‌ యూజర్లకు అమెజాన్‌ సూపర్‌ ఆఫర్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్‌..

By S Ashok Kumar  |  First Published Jan 13, 2021, 6:36 PM IST

అమెజాన్ ప్రైమ్  ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం భారతదేశంలో ఈ ప్లాన్ రూ.89 నుండి ప్రారంభమవుతుంది.


ఆన్ లైన్ ఓ‌టి‌టి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం భారతదేశంలో ఈ ప్లాన్ రూ.89 నుండి ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ‌టి‌టి ప్రత్యర్థి నెట్‌ఫ్లిక్స్  మొబైల్ ప్లాన్‌ను నెలకు రూ. 199 ధరతో విడుదల చేసిన తర్వాత  అమెజాన్ దీనిని ప్రవేశపెట్టింది.

అమెజాన్ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మొదట 30 రోజుల ఫ్రీ ట్రయల్, దీని తర్వాత ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం రూ.89 ధరతో 28 రోజుల వాలిడిటీ, 6జి‌బిడేటా లభిస్తుంది.

Latest Videos

undefined

సాధారణంగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వానికి నెలకు రూ.129, సంవత్సరానికి 999 రూపాయలు ఖర్చవుతుంది.

also read 

అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో, "దేశంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ చొచ్చుకు పోవడంతో, మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే స్ట్రీమింగ్ డివైజెస్ లో ఒకటిగా మారింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్ ప్రారంభించడంతో మా ప్రత్యేకమైన, ఒరిజినల్ కంటెంట్‌తో ప్రతి భారతీయుడిని అలరించడానికి మేము ఎదురుచూస్తున్నాము, " అని అన్నారు.

ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనేది  సింగల్ యూసర్ మొబైల్ ప్లాన్. ఈ ప్లాన్ తో వినియోగదారులకు ఎస్‌డి (స్టాండర్డ్ డెఫినేషన్) క్వాలిటీ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.ఈ ప్లాన్ కింద ఉన్న ఇతర ఆఫర్లలో రూ.299 ఒకటి. దీని ద్వారా వీడియో కంటెంట్‌తో పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జిబి డేటా యాక్సెస్‌, 28 రోజుల వాలిడిటీ ఉంటుంది.
 

click me!