ఒకప్పుడు కారు రిపైర్ కి కూడా డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..

By S Ashok KumarFirst Published Jan 12, 2021, 3:50 PM IST
Highlights

 కొద్దిరోజుల క్రితం అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా  ఎలోన్ మస్క్ అవతరించాడు. కాని ఒకప్పుడు తన వద్ద కారు రిపేర్ చేయించడానికి  డబ్బులు కూడా ఉండేవి కావు.

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కొద్దిరోజుల క్రితం అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా  ఎలోన్ మస్క్ అవతరించాడు. కాని ఒకప్పుడు తన వద్ద కారు రిపేర్ చేయించడానికి  డబ్బులు కూడా ఉండేవి కావు.

అతను 1993లో కొనుగోలు చేసిన పాత 1978 బి‌ఎం‌డబల్యూ 320i  కోసం ఎలోన్ మస్క్ ఒక జంక్‌యార్డ్ నుండి 20 డాలర్లకు ఒక కార్ డోర్ గ్లాస్ కొనుగోలు చేశాడు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో కారు గ్లాస్ ఫిక్సింగ్ చేస్తున్న పాత ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోని ఎలోన్ మస్క్ తల్లి మాయే మస్క్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

"1995లో ఎలోన్ మస్క్ తన కారు రిపేర్  కోసం డబ్బు చెల్లించలేని పరిస్థితిలో తానే స్వయంగా తన కారును  రిపేర్ చేసుకున్నాడు" అంటూ ఒక ట్విట్టర్ యూజర్ ఎలోన్ మస్క్  ఫోటో ని షేర్ చేస్తూ రాశాడు, ఈ ఫోటోలో ఎలోన్ మస్క్ కారు విండోను ఫిక్సింగ్ చేస్తు కనిపిస్తాడు.

 

⁦⁩ #1995 And people said you knew nothing about cars😏🤣 😍 pic.twitter.com/CpfKvjXdQh

— Maye Musk (@mayemusk)

also read కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న అద్భుతమైన కార్లు ఇవే.. వాటి ధర, వివరాలు తెలుసుకోండి.. ...

"నేను జంక్‌యార్డ్ నుండి రీప్లేస్‌మెంట్ గ్లాస్‌ను 20 డాలర్లకు కొన్నాను. ఆ జంక్‌యార్డ్ విడిభాగాలను కొనడానికి గొప్ప ప్రదేశాలు"  అంటూ తన పాత ఫోటోకి రిప్లే ఇస్తూ 49 ఏళ్ల ఎలోన్ మస్క్ సోమవారం రిట్వీట్ చేశారు.

ఈ పాత ఫోటోని మొట్టమొదట ఎలోన్ మస్క్ తల్లి మేయే మస్క్ 2019లో ట్విట్టర్‌లో షేర్ చేశారు. "@Elonmusk #1995 కార్ల గురించి మీకు ఏమీ తెలియదని ప్రజలు అన్నారు. ఇది నిన్ను విమర్శించే వారికి సమాచనం అంటూ ఆమె రాసింది.

తన తల్లి మేయే మస్క్ ట్వీట్‌కు సమాధానమిస్తూ ఎలోన్ మస్క్ ప్రొఫెషనల్ రిపేర్స్ చేయలేకపోతున్న కానీ ఆ పాత బిఎమ్‌డబ్ల్యూ  కారుకి తాను మొత్తం రిపైర్స్ పరిష్కరించుకున్నానని వెల్లడించాడు.

"నేను కార్ రిపేర్స్ కోసం డబ్బు చెల్లించలేకపోయాను, అందువల్ల నేను ఆ కారులో దాదాపు ప్రతిదీ జంక్‌యార్డ్‌లోని వీడిభాగాలతో  ఫిక్స్ చేశాను" అని రాశాడు. అతను 1978 బిఎమ్‌డబ్ల్యూ 320ఐని 1,400 (సుమారు రూ. 1 లక్షలు)డాలర్లకు  కొన్నట్లు వెల్లడించాడు.

 

. in 1995, fixing his car by himself as he couldn't afford to pay for repairs pic.twitter.com/85KHnKtPCA

— Pranay Pathole (@PPathole)
click me!