అమెజాన్ లో 20వేల ఉద్యోగాలు.. వారికి పర్మనెంట్ ఉద్యోగిగా అవకాశం..

By Sandra Ashok Kumar  |  First Published Jun 29, 2020, 12:53 PM IST

రాబోయే ఆరు నెలల్లో కస్టమర్ల రద్దీ, ఊహించిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త టెంపరరీ నియమకాలు చేసుకుంటున్నట్లు చెప్పింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగ, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో నగరాల్లో ఈ నియమకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 


ఇ-కామర్స్ దిగ్గజం  అమెజాన్ ఇండియా తన  సంస్థలోని కస్టమర్ సర్వీస్ (సిఎస్) విభాగంలోని  20వేల కొత్త నియమకాలు చేసుకొనున్నట్లు తెలిపింది.  'సిజనల్ ' లేదా టెంపరరీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆదివారం రోజున వెల్లడించింది.

రాబోయే ఆరు నెలల్లో కస్టమర్ల రద్దీ, ఊహించిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త టెంపరరీ నియమకాలు చేసుకుంటున్నట్లు చెప్పింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగ, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో నగరాల్లో ఈ నియమకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

Latest Videos

undefined

అమెజాన్ 'వర్చువల్ కస్టమర్ సర్వీస్' ప్రోగ్రామ్‌లో ఎక్కువ నియమకాలు ఉంటాయని, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. కొత్త నియమకాలు ఇ-మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ ద్వారా అసోసియేట్స్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అందిస్తాయి.

also read 

ఈ ఉద్యోగాలకు  కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు లేదా కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉండాలి అని చేపింది. అభ్యర్థుల పనితీరు, వ్యాపార అవసరాల ఆధారంగా, ప్రస్తుత టెంపరరీ స్థానాల్లో నియమితులైన వారి నుండి కొంత శాతం ఈ ఏడాది చివరికి పర్మనెంట్   ఉద్యోగులుగా మార్చబడే అవకాశం ఉందని అమెజాన్ ఇండియా తెలిపింది.

"పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ కు  ప్రతిస్పందనగా కస్టమర్ సర్వీస్ ఆర్గనైజెషన్ అంతటా నియామక అవసరాలను మేము నిరంతరం అంచనా వేస్తున్నాము. భారతీయ, ప్రపంచ సెలవు సీజన్లు ప్రారంభం కావడంతో వచ్చే ఆరు నెలల్లో కస్టమర్ల ట్రాఫిక్ మరింత పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము" అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (కస్టమర్ సేవ) అక్షయ్ ప్రభు అన్నారు.

కొత్త నియామక అభ్యర్థులకు ఉద్యోగ భద్రత, జీవనోపాధిని కల్పిస్తాయని ఆయన అన్నారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, దాని లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో నిరంతర పెట్టుబడుల ద్వారా 2025 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టించాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. భారతదేశంలో గత ఏడు సంవత్సరాలుగా అమెజాన్ పెట్టుబడులు ప్రారంభించిన తరువాత 7 లక్షల ఉద్యోగాలను కల్పించింది అని తెలిపింది.
 

click me!