ఆన్‌లైన్ మోసలను గుర్తించడానికి అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్..త్వరలో అందుబాటులోకి

Ashok Kumar   | Asianet News
Published : Jul 30, 2020, 01:33 PM ISTUpdated : Jul 30, 2020, 11:08 PM IST
ఆన్‌లైన్ మోసలను గుర్తించడానికి అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్..త్వరలో అందుబాటులోకి

సారాంశం

అమెజాన్.కామ్ కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీపై ఈ సర్వీస్ ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్‌తో వినియోగదారులు మెషీన్ లెర్నింగ్‌తో మోసాలను మరింత త్వరగా, సులభంగా, కచ్చితంగా గుర్తించగలుగుతారు,

అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ ఫ్రాడ్ డిటెక్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఆన్‌లైన్ పేమెంట్, గుర్తింపు మోసం వంటి మోసపూరిత ఆన్‌లైన్ కార్యకలాపాలను త్వరగా గుర్తించడానికి మెషీన్  లెర్నింగ్ -బెసేడ్ సేవలను అమెజాన్ సిద్దం చేసింది.

అమెజాన్.కామ్ కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీపై ఈ సర్వీస్ ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్‌తో వినియోగదారులు మెషీన్ లెర్నింగ్‌తో మోసాలను మరింత త్వరగా, సులభంగా, కచ్చితంగా గుర్తించగలుగుతారు, అయితే మోసం మొదటి స్టేజ్  లోనే జరగకుండా నిరోధించగలదని కంపెనీ మంగళవారం తెలిపింది.

"శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ బేసిడ్ టెక్నాలజి మోసాలను గుర్తించటానికి, కస్టమర్ల ముందుకు అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్‌ను తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము, తద్వారా మోసాలను ఆటోమేటిక్ గా గుర్తించగలరు, సమయం, డబ్బు కూడా ఆదా చేయవచ్చు, కస్టమర్ అనుభవాలను కూడా మెరుగుపర్చవచ్చు ”అమెజాన్ మెషిన్ లెర్నింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇంక్ వైస్ ప్రెసిడెంట్ స్వామి శివసుబ్రమణియన్ అన్నారు.

also read భారత ప్రభుత్వ సందేహాలకు సమాధానం ఇచ్చాం : టిక్‌టాక్‌ ...

అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్ కన్సోల్‌లో కేవలం కొన్ని క్లిక్‌లతో, కస్టమర్‌లు ముందే నిర్మించిన మెషీన్ లెర్నింగ్ మోడల్ టెంప్లేట్‌ను ఎంచుకోవచ్చు, చారిత్రక ఈవెంట్ డేటాను అప్‌లోడ్ చేయవచ్చు. అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్‌తో నిర్వహించడానికి ముందస్తు పేమెంట్లు, దీర్ఘకాలిక కట్టుబాట్లు లేదా మౌలిక సదుపాయాలు లేవు.  

అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్ మంగళవారం నుండి యుఎస్ ఈస్ట్ (ఎన్. వర్జీనియా), యుఎస్ ఈస్ట్ (ఒహియో), యుఎస్ వెస్ట్ (ఒరెగాన్), ఇయు (ఐర్లాండ్), ఆసియా పసిఫిక్ (సింగపూర్), ఆసియా పసిఫిక్ (సిడ్నీ) ​​లలో లభిస్తుంది. రాబోయే నెలల్లో అదనపు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది అని కంపెనీ తెలిపింది. అమెజాన్ ఫ్రాడ్ డిటెక్టర్‌ను కస్టమర్లు, గోడాడ్డీ, ట్రూవో, యాక్టివ్ క్యాంపెయిన్ ఉపయోగిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Motorola Edge 70 : మోటోరోలా ఎడ్జ్ 70 సేల్ షురూ.. ధర, ఆఫర్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే