భారత ప్రభుత్వ సందేహాలకు సమాధానం ఇచ్చాం : టిక్‌టాక్‌

Ashok Kumar   | Asianet News
Published : Jul 30, 2020, 11:27 AM IST
భారత ప్రభుత్వ సందేహాలకు సమాధానం ఇచ్చాం : టిక్‌టాక్‌

సారాంశం

జాతీయ భద్రతా, గోప్యతా సమస్యల దృష్ట్యా ఆరోపణలపై ఇండియాలో గత నెలలో నిషేధించిన 59 చైనా యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. భారతదేశంలో టిక్‌టాక్  200 మిలియన్ల డౌన్ లోడ్ యూసర్లు ఉన్నారు(గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం).

బెంగళూరు: భారత ప్రభుత్వ అభ్యంతరాలన్నింటికి టిక్‌టాక్ ప్రతిస్పందనను భారత ప్రభుత్వానికి సమర్పించిందని, వారి సమస్యలను పరిష్కరించడానికి,  స్పష్టత ఇవ్వడానికి వారితో కలిసి పనిచేస్తున్నట్లు షార్ట్ వీడియో యాప్  టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ బుధవారం తెలిపారు.


జాతీయ భద్రతా, గోప్యతా సమస్యల దృష్ట్యా ఆరోపణలపై ఇండియాలో గత నెలలో నిషేధించిన 59 చైనా యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. భారతదేశంలో టిక్‌టాక్  200 మిలియన్ల డౌన్ లోడ్ యూసర్లు ఉన్నారు(గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం). ఈ యాప్‌ల నుంచి భద్రత, గోప్యతా, యాజమాన్య వివరాలపై భారత ప్రభుత్వం వివరణ కోరింది.


"మేము భారతదేశంలోని మా వినియోగదారుల సమాచారాన్ని ఏ విదేశీ ప్రభుత్వాలతోనూ పంచుకోలేదు, లేదా భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా మేము ఏలాంటి డేటాను ఉపయోగించలేదు" టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ అన్నారు.

also read వివో స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా 4వేల తగ్గింపు.. ...

భవిష్యత్తులో టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌ను మళ్ళీ మా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశతో భారత ప్రభుత్వంతో సహకరిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.

టిక్‌టాక్ భారతదేశంలో వీడియో క్రీయేటర్స్ కమ్యూనిటికి కట్టుబడి ఉందని, ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది టిక్‌టాక్ వినియోగదారులను వారి ప్రతిభతో అలరిస్తుందని, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్‌లను ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.

"దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, కథకులు, అధ్యాపకులు, ప్రదర్శకులు మా వేదిక ద్వారా గుర్తింపును మాత్రమే కాకుండా జీవనోపాధి మెరుగుదలకు కొత్త మార్గాలను కనుగొన్నారు" అని ఆయన అన్నారు. టిక్‌టాక్ పై లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వానికి ప్రతిస్పందనను సమర్పించినట్లు టిక్‌టాక్ ఇండియా హెడ్ గాంధీ చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Motorola Edge 70 : మోటోరోలా ఎడ్జ్ 70 సేల్ షురూ.. ధర, ఆఫర్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే