మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ల.. అయితే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీగా కావాలంటే ఇలా చేయండి..

By Sandra Ashok Kumar  |  First Published Nov 4, 2020, 3:32 PM IST

తాజాగా దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త ఎయిర్‌టెల్ ఆఫర్ కింద వినియోగదారులకు 3 నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం అందిస్తుంది.


ఈ పండగ సీజన్‌లో టెలికాం సంస్థలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నయి. తాజాగా దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త ఎయిర్‌టెల్ ఆఫర్ కింద వినియోగదారులకు 3 నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం అందిస్తుంది.

ఇటీవల ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు డిస్నీ + హాట్ స్టార్ విఐపి సభ్యత్వాన్ని ఉచితంగా ఇఇచ్చింది. దీనికి అదనంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం అందించేందుకు యూట్యూబ్ ప్రీమియం ఆఫర్ కూడా తీసుకొచ్చింది.

Latest Videos

undefined

 యూట్యూబ్ ప్రీమియం అంటే ఏమిటి?
యూట్యూబ్ లో ఏదైనా వీడియోలు చూస్తున్నప్పుడు మనకు యాడ్స్ ఒకోసారి చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే ఈ యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని తీసుకుంటే వినియోగదారులు యాడ్స్ లేని వీడియోలను చూడటం ఆనందించవచ్చు.

ఇది మాత్రమే కాదు, స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా వీడియోను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో ప్లే చేస్తుంది. యూట్యూబ్ ప్రీమియానికి సభ్యత్వం లేనప్పుడు, వీడియో చూసేటప్పుడు చాలా ప్రకటనలు కనిపిస్తాయి, అలాగే స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది.

also read రియల్‌మీ ఫెస్టివల్ డేస్ సేల్.. 4జి స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే.. ...

ఎయిర్‌టెల్ ఆఫర్‌ ఎలా పొందవచ్చు
ఈ ఆఫర్‌ పొందాలంటే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ మీ ఫోన్ లో ఉండాలి. మీరు కూడా 3 నెలల ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం ప్రయోజనాన్ని కోరుకుంటే, మీరు మొదట మీ మొబైల్‌లోని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ఓపెన్ చేయాలి.

తరువాత యాప్ లో మోర్ అనే ఆప్షన్ నొక్కండి, ఎయిర్‌టెల్ రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు మీ ఇంట్రెస్ట్ జోడించాలి. ఆ తరువాత యూట్యూబ్ ప్రీమియం బ్యానర్‌పై క్లిక్ చేయండి.

నిబంధనలు, షరతులను అంగీకరించిన తరువాత మీరు ఈ ఎయిర్‌టెల్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని తీసుకోని వినియోగదారులు మాత్రమే ఎయిర్‌టెల్ ఆఫర్‌ను పొందుతారు.

ఎయిర్‌టెల్ యూట్యూబ్ ప్రీమియం ఆఫర్ వాలిడిటీ 
ఈ ఆఫర్ 22 మే 2021 వరకు మాత్రమే వర్తిస్తుంది. మీరు మూడు నెలల తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఉపయోగించాలనుకుంటే, ఇందుకోసం కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

click me!