ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ పెంపు... ఆదివారం నుంచే అమలు..

By Sandra Ashok KumarFirst Published Dec 30, 2019, 12:06 PM IST
Highlights

ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇక నుంచి 28 రోజుల ఎయిర్‌టెల్ వాలిడిటీ మినిమమ్ రిచార్జ్ రూ. 23 ఇప్పుడు కనీసం రూ .45 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వినియోగదారులు నెలకు కనీసం 22 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  
 

ముంబై: భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు  రూ .23 మిమిమమ్ రీఛార్జ్ వాలిడిటీ ప్లాన్‌ను రూ. 45కు పెంచింది. ఇది 95% పెరుగుదల, వినియోగదారుల నుండి ఆదాయాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన లక్ష్యాన్ని సాధించడానికి టెల్కో స్పెక్ట్రం అంతటా సుంకాలను పెంచింది.

also read వావ్ ఒప్పో.. 14.60 లక్షలు దాటిన రెనో సిరీస్ ఫోన్ల బుకింగ్స్

ఆదివారం ఒక పబ్లిక్ నోటీసులో రెండవ అతిపెద్ద టెల్కో అయిన ఎయిర్‌టెల్ నెట్వర్క్ కొత్తగా పెంచిన మిమిమమ్ రీఛార్జ్ ప్లాన్ ధర డిసెంబర్ 29 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది.ఎయిర్‌టెల్  కస్టమర్‌లు 28 రోజుల వాలిడిటీకి  రూ.23 రిచార్జ్ బదులుగా కనీసం రూ .45 మినిమమ్ రీఛార్జ్ చేసుకోవాలి. అందువల్ల వినియోగదారులకి నెలకు కనీసం 22 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

రూ .45 లేదా అంతకంటే ఎక్కువ వోచర్‌తో రీఛార్జ్ చేసుకోకపోతే, గ్రేస్ పీరియడ్ తర్వాత అన్ని సర్వీసులు నిలిపివేయబడతాయి ”అని కంపెనీ పబ్లిక్ నోటీసులో పేర్కొంది.ఇప్పుడు అందరి దృష్టి వోడాఫోన్ ఐడియాపై పడింది. ఇది సుమారు 23 రూపాయల బేస్ రీఛార్జ్ ప్యాక్ కలిగి ఉంది. కానీ దానిని కూడా సవరించాలని వోడాఫోన్ ఐడియా భావిస్తుంది. 

also read ఇక వాట్సాప్​ మెసేజేస్ వాటంతట అవే మాయం.. ఎలాగంటే!

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మినిమమ్ రీఛార్జ్ ప్లాన్ దాని స్మార్ట్ ఫోన్, జియోఫోన్ కస్టమర్లకు రూ .75, రూ .98 నుండి  ప్రారంభమవుతుంది.ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) సెప్టెంబర్ చివరి నాటికి ఎయిర్‌టెల్  ARPU రూ .128 వద్ద ఉంది. ఎయిర్‌టెల్ ఇంకా ఇతర నెట్వర్క్ లు  డిసెంబర్ 2016 నుంచి మొదటిసారిగా టారిఫ్ ప్లాన్ లను తాజాగా మార్చింది.


వొడాఫోన్ ఐడియా ARPU వచ్చే రెండు త్రైమాసికాలలో రూ .107 నుండి రూ .143 కు, ఎయిర్టెల్ రూ .128 నుండి 145-150 రూపాయలకు పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. FY20 నాల్గవ త్రైమాసికం నాటికి జియో ARPU రూ .140 కు పెరగవచ్చు. మూడేళ్ల టెల్కో  ARPU సెప్టెంబర్ త్రైమాసికంలో 120 రూపాయలు.
 

click me!