ఆ చైనా యాప్స్ వెంటనే డిలిట్ చేయండి లేదంటే..: నిఘా వర్గాల వార్నింగ్

Ashok Kumar   | Asianet News
Published : Jun 18, 2020, 03:49 PM ISTUpdated : Jun 23, 2020, 11:43 AM IST
ఆ చైనా యాప్స్ వెంటనే డిలిట్ చేయండి లేదంటే..: నిఘా వర్గాల వార్నింగ్

సారాంశం

చైనాకు సంబంధించిన టిక్ టాక్, హెలొ యాప్, కామ్ స్కానర్, బైట్ డ్యాన్స్, ఇంకా ఇతర 50కి పైగా యాప్స్ నిషేదించాలి అంటూ  నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీని వల్ల భారతదేశ ప్రజల యూసర్ డేటాలను చైనా దేశానికి చేరవేస్తున్నాయి అని దీని వల దేశ ప్రజాల పర్సనల్ డేటాకీ ఆటంకానికి భంగం కలిగించే అవకాశం ఉందని ప్రజలు దీనిని వెంటేనే తెసేయాలని నిఘా వర్ఘలు యూసర్లను అప్రమత్తం చేస్తున్నారు.  

న్యూ ఢిల్లీ: దేశానికి ప్రజల భద్రతకు ముప్పు ఉన్న యాప్స్ నిషేధించాలంటు అలాగే వారు పేర్కొన్న 50 చైనా మొబైల్ యాప్‌లను భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. భారత భద్రతా సంస్థలు సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలోని ప్రజల భద్రతా డేటాను ఈ యాప్‌ల ద్వారా ప్రమాదం ఉందని హెచ్చరించింది.

టిక్-టాక్, హెలో, యుసి బ్రౌజర్ వంటి మొబైల్ యాప్ లు  దేశ ప్రజల భద్రతకు ముప్పుగా ఉందని భారత భద్రతా సంస్థలు  భావిస్తారు. చైనాకు సంబంధించిన టిక్ టాక్, హెలొ యాప్, కామ్ స్కానర్, బైట్ డ్యాన్స్, ఇంకా ఇతర 50కి పైగా యాప్స్ నిషేదించాలి అంటూ  నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

దీని వల్ల భారతదేశ ప్రజల యూసర్ డేటాలను చైనా దేశానికి చేరవేస్తున్నాయి అని దీని వల దేశ ప్రజాల పర్సనల్ డేటాకీ ఆటంకానికి భంగం కలిగించే అవకాశం ఉందని ప్రజలు దీనిని వెంటేనే తెసేయాలని నిఘా వర్ఘలు యూసర్లను అప్రమత్తం చేస్తున్నారు.

also read మహిళల బాధలను బయటపెట్టేందుకు ట్విట్టర్‌ సరికొత్త టూల్...

కొన్ని రేపోట్టుల ప్రకారం ఈ కంపెనీలు  దేశ యూజర్ డేటాను ఇతర దేశాలకు పంపిస్తుందని వారు వెల్లడించారు. భారత్- చైనా దళాల మధ్య ఘర్షణలో లడఖ్ లోని గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులైన జవాన్లు  ప్రాణాలు కోల్పోయిన తరువాత ఒకేసారి చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరించాలని కొన్ని వ్యాపారాల సంఘాల పిలుపులు మరోసారి భారతదేశం అంతటా చెలరేగాయి.

అమరవీరులైన సైనికుల మరణాలకు ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో ఉన్న నిరసనకారులు చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేశారు. వార్తా సంస్థల నివేదికల ప్రకారం కొందరు నిరసనకారులు చైనా దేశ జెండాలు, చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా  తగలబెట్టారు.


అలాగే టెలికాం విభాగం 4జి అప్‌గ్రేడేషన్ సమయంలో చైనా టెలికం పరికరాలను ఉపయోగించవద్దని బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా దేశంలో 5జి కోసం భారతదేశ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) వ్యూహాన్ని చైనా కంపెనీలైన జెడ్‌టిఇ,

హువావేలతో తిరిగి ఆలోచించాలని కొన్ని వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా చైనాకు సంబంధించిన యాప్స్, ఇతర దిగుమతులపై తాజాగా నిషేధించాలంటు వ్యాపారాలు సంఘాలు కూడా నిరసనలు వెల్లడించాయి.
 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే