మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

By ramya neerukondaFirst Published Jan 18, 2019, 1:15 PM IST
Highlights

భారత్‌ బౌలర్‌ యజువేంద్ర చాహల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల్లాడింది. తన బౌలింగ్ మాయాజాలంతో చాహల్..  ఆసిస్ ఆటకట్టించాడు. 

భారత్‌ బౌలర్‌ యజువేంద్ర చాహల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల్లాడింది. తన బౌలింగ్ మాయాజాలంతో చాహల్..  ఆసిస్ ఆటకట్టించాడు. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో చాహల్ (6/42) దెబ్బకి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 230 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. భారత్ కు ఆస్ట్రేలియా 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాగా.. ఈ మ్యాచ్ లో చాహల్ తన బౌలింగ్ మాయాజాలంతో రికార్డు సృష్టించాడు. గతంలో  ఇండియన్ మాజీ పేసర్ అజిత్ అగర్కార్ 2004లో 6/42 రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అజిత్ అగార్కర్ ఈ రికార్డు సాధించాడు. కాగా.. ఇప్పుడు ఈ రికార్డుని చాహల్ సాధించాడు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ పదువైన బంతులతో ఓపెనర్ల భరతం పట్టాడు. తర్వాత ఖవాజా, మార్ష్‌ జాగ్రత్తగా ఆడి స్కోరును వంద పరుగులకు చేర్చారు. వీరిద్దరినీ వెంట వెంటనే అవుట్‌ చేసి చాహల్‌ వికెట్ల వేట ప్రారంభించాడు. ఒక ఎండ్‌లో హ్యాండ్స్‌కోంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరు 200 పరుగులు దాటించాడు. 

ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 63 బంతుల్లో 2 ఫోర్లతో 58 పరుగులు చేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వరుస బ్యాట్స్‌మన్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఆసీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.  భారత బౌలర్లలో చాహల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌, షమి రెండేసి వికెట్లు తీశారు.

click me!