వరల్డ్ కప్.. టీంఇండియాదే... సచిన్ కామెంట్స్

Published : May 03, 2019, 12:30 PM IST
వరల్డ్ కప్.. టీంఇండియాదే... సచిన్ కామెంట్స్

సారాంశం

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అయితే... ఈసారి వరల్డ్ కప్ ని విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీం ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అయితే... ఈసారి వరల్డ్ కప్ ని విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీం ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వరల్డ్ కప్ తన ఫేవరేట్ టీం ఇండియానేనని.... మన జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సచిన్ అన్నారు. ‘మే 30 నుంచి జరిగే ఈ ప్రపంచకప్‌ పూర్తి వేసవిలో జరగనుంది. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లాండ్‌ వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు.’ అని సచిన్ అన్నారు.

అనంతరం టీం ఇండియా బ్యాట్ మెన్స్ గురించి మాట్లాడుతూ... కోహ్లీ, కేఎల్ రాహుల్, పాండ్యా ఇతర క్రికెటర్లంతా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పారు. వీళ్లంతా ఐపీఎల్ లో బాగా రాణిస్తున్నారని... వరల్డ్ కప్ లో కూడా ఇదే విధంగా ఆడి జట్టు విజయానికి కారణమౌతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
PREV
click me!

Recommended Stories

Devdutt Padikkal : 4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. గంభీర్, అగార్కర్‌లకు పెద్ద తలనొప్పి!
Sarfaraz Khan : 16 సిక్సర్లు, 14 ఫోర్లు, 217 రన్స్.. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో రోహిత్ రికార్డు బద్దలు !