వరల్డ్ ఛాంపియన్‌గా మేరీకోమ్...ఆరో గోల్డ్ మెడల్ కైవసం

By Arun Kumar PFirst Published Nov 24, 2018, 4:56 PM IST
Highlights

మహిళా బాక్సింగ్ ప్రంపంచ ఛాపింయన్‌షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్ అదరగొట్టింది. తన పదునైన పంచులతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇవాళ ఫైనల్ పోరులో భాగంగా ఉక్రెయిన్ బాక్సర్ హన్నా హొఖోటాపై తిరుగులేని ఆధిపత్యం సాధించి ఆరోసారి గోల్డ్ మెడల్ సాధించింది. 

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళ ప్రపంచ బ్యాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ 48 కిలోల విభాగంలో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ ఆరంభం నుండి ఆమె తిరుగులేని ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. ఇక గురువారం జరిగిన సెమీఫైనల్లో నార్త్ కొరియా బాక్సర్ కిమ్ హ్యాంగ్ మీ ని మట్టికరిపించి ఫైనల్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా  బలమైన ప్రత్యర్థి ఒఖోటాను కూడా తన పంచులతో బెంబేలెత్తించిన ఘన విజయం సాధించింది. దీంతో మేరీకోమ్ ఖాతాలోకి ఆరో గోల్డ్ మెడల్ చేరింది. 

ఇలా ప్రపంచ ఛాంపియన్ షిప్ అత్యధికి గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా మేరీకోమ్ నిలిచింది. ఈ విజయంతో మేరీకోమ్  ఐరిష్ భాక్సర్ కేటీ టైలర్ రికార్డును సమం చేసింది. వీరిద్దరు అత్యధికండగా ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారు.   

click me!