ఆర్సీబీ హ్యాట్రిక్...ప్రపంచానికి తెలుసంటున్న కోహ్లీ

By telugu teamFirst Published Apr 25, 2019, 8:51 AM IST
Highlights

ఐపీఎల్ సీజన్ లో మొన్నటి వరకు పాయింట్స్ పట్టికలో  చిట్టచివర ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు పైకి ఎగబాకుతోంది. వరసగా మూడో విజయాన్ని ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. 

ఐపీఎల్ సీజన్ లో మొన్నటి వరకు పాయింట్స్ పట్టికలో  చిట్టచివర ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు పైకి ఎగబాకుతోంది. వరసగా మూడో విజయాన్ని ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. తాజాగా బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్  విరాట్ కోహ్లీ... మీడియాతో మాట్లాడారు.  వరసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయినప్పుడు చాలా బాధగా అనిపించిందనది కోహ్లీ అన్నారు. కానీ.. తమ జట్టు ఆటగాళ్లు మాత్రం ఎప్పుడూ ఒత్తిడదిలో కుంగిపోలేదని ఆయన అన్నారు. తాము ఎలా ఆడామో తమకు బాగా తెలుసు.. ప్రపంచానికి కూడా తెలుసు అన్నారు.

‘‘జట్టుగా ఆడటం మంచి ఫలితాలను తెచ్చి పెడుతుందని మేం నమ్మాం. మేము చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయాలు సాధించాం. ఆ ఒక్కదాంట్లో కూడా గెలిచి ఉండాల్సింది. అయితే, క్రికెట్‌ను ఎంత ఆస్వాదిస్తూ ఆడితే అంత ప్రయోజనం ఉంటుంది.’’ అని కోహ్లీ అన్నారు.

‘‘ఈ రోజు మ్యాచ్‌లో మా జట్టు ఆటతీరే అందుకు ఉదాహరణ. స్టొయినీస్‌, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌కు మంచి పునాది వేశారు. 175 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగితే చాలు అనుకున్న సమయంలో వాళ్లిద్దరూ చెలరేగి 200 పరుగుల మైలురాయి దాటించారు. ఈ విజయంలో కీలక పాత్ర వాళ్లదే’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

click me!