సామాజిక దూరం అంటే ఇది.. ఉసేన్ బోల్ట్ పోస్ట్.. నెట్టింట జోక్స్

By telugu news team  |  First Published Apr 15, 2020, 10:16 AM IST
2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌‌కు సంబంధించిన ఫోటో అది. ఆ టోర్నీలో 100 మీటర్ల రేస్‌ గెలిచిన బోల్ట్ తాను విన్నింగ్ లైన్ దాటుతున్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ ఇలా పాటించడంటూ కాప్షన్ పెట్టాడు. 
 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు  చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ వైరస్ కి ఇప్పటి వరకు మందు కనిపెట్టేలేకపోగా.. సామాజిక దూరం పాటిండమే ఉత్తమం అని అందరూ చెబుతున్నారు.

Social Distancing pic.twitter.com/lDCAsxkOAw

— Usain St. Leo Bolt (@usainbolt)
కాగా... ఈ సామాజిక దూరంపై అవగాహన కల్పిస్తూ..జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా.. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. 

2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌‌కు సంబంధించిన ఫోటో అది. ఆ టోర్నీలో 100 మీటర్ల రేస్‌ గెలిచిన బోల్ట్ తాను విన్నింగ్ లైన్ దాటుతున్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ ఇలా పాటించడంటూ కాప్షన్ పెట్టాడు. 

We social distancing pic.twitter.com/hdrWIyGaAc

— Deyvid #EvdeKal (@atavratdeyvid2)
అప్పుడు విజేతగా నిలిచి న క్షణాల్ని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్‌ నికోలస్‌ తన కెమెరాలో బంధించాడు. ఇందులో బోల్ట్‌ అందరికంటే ముందుగా, వేగంగా, తోటి పోటీదారులు ఫినిషింగ్‌ లైన్‌కు దూరంగా ఉండగానే ముగించాడు. ఇందు లో సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్సింగ్‌) కోణం కనబడుతుంది. 

మహమ్మారి విజృంభణతో ఇప్పు డు ప్రపంచమంతా ఈ దూరంతోనే బతికేస్తోంది. అందుకే నాటి ఫొటో ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి ఓ నెటిజన్ ‘మీరు ఎప్పుడూ పాటిస్తూనే ఉంటారు కదా..’ అంటూ చమత్కరించాడు.

కొందరు దీనిపై పాజిటివ్ గా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం మీమ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు బాగా నవ్విస్తోంది. ఓ వ్యక్తి పరుగు పందెంలో పరిగెడుతూ.. చేతిలో తుపాకీ పట్టుకొని... తనను దాటడానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ కాల్చేస్తున్నాడు. ప్రస్తుతం అందరూ ఇలాంటి సామాజిక దూరమే పాటిస్తున్నారంటూ అతను చేసిన పోస్టు కూడా ఆకట్టుకుంటోంది. 
click me!