Tokyo Olympics: క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన భారత ఆర్చర్ దీపికా కుమారి

By team teluguFirst Published Jul 30, 2021, 6:27 AM IST
Highlights

ఆర్చరీ 1/8 ఎలిమినేషన్స్  షూట్ అవుట్ లో విజయం సాధించి భారత ఏస్ ఆర్చర్ వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది.

నేడు జరిగిన ఆర్చరీ 1/8 ఎలిమినేషన్స్  షూట్ అవుట్ లో విజయం సాధించి భారత ఏస్ ఆర్చర్ వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. రష్యన్ ఆర్చర్ పెరోవా తో జరిగిన మ్యాచులో 5 సెట్లలో దీపిక రెండు సెట్లను గెలవగా... పేరొవ రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అవడంతో స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. 

ఆ తరువాత జరిగిన షూట్ అవుట్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా 7 పాయింటర్ల షాట్ మాత్రమే కొట్టగా... దీపిక ఎక్సలెంట్ 10 పాయింటర్ తో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. టోక్యోలో నేటి ఉదయం చిరుజల్లులు కురుస్తుండడంతో వాతావరణం ఎలా ఉంటుందో అని అంతా భయపడ్డప్పటికీ... అంతా సజావుగా సాగింది. 

ఇక నిన్న జరిగిన మ్యాచులో భారత ఆర్చర్ అతాను దాస్ వరల్డ్ నెం.3 ఆర్చర్ కొరియాకు చెందిన జిన్  హూతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్నాడు  అతాను దాస్  . మొదటి సెట్ జిన్ సొంతం చేసుకోగా, వరుసగా రెండు సెట్లు టై అయ్యాయి.

నాలుగో సెట్‌ను  అతాను దాస్  గెలవగా, కీలకమైన ఐదో సెట్ కూడా టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ రౌండ్‌ను ఎంచుకోగా... జిన్  9 పాయింట్లు సాధించగా,  అతాను దాస్  10 పాయింట్లు స్కోరు చేసి విజయం సాధించాడు.

అంతకుముందు  తైపీ కి చెందిన డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌ను 6-4 తేడాతో సొంతం చేసుకున్నాడు అతాను దాస్.  టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి మంచి విజయాలు దక్కాయి.

బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై విజయాన్ని అందుకుంది. రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌‌ను ఐదో స్థానంతో ముగించారు.

ఓవరాల్‌గా 6:29.66 టైమ్‌లో రేసును ముగించిన ఈ జోడి టీమిండియాకి బెస్ట్ రిజల్ట్‌ను అందించినా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. అయితే ఒలింపిక్స్‌లో రోయింగ్ ఈవెంట్‌లో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

click me!