వరల్డ్‌కప్‌పై ఐపిఎల్ ప్రభావం పడకుండా కీలక నిర్ణయం: రవిశాస్త్రి

By Arun Kumar PFirst Published Feb 7, 2019, 2:13 PM IST
Highlights

ఈ ఏడాది జరిగనున్న ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లపై పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు టీంఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. బిసిసిఐ ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే ఐపిఎల్ తో పాటు వరల్డ్ కప్ రెండు భారత జట్టుకు ముఖ్యమేనని ఆయన అన్నారు. అయితే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు కొద్దిరోజుల ముందే జరిగే ఐపిఎల్లో పాల్గొని గాయాలపాలవడం, ఫిట్ నెస్ దెబ్బతినడం వంటివి జరక్కుండా వుండేందుకు ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నట్లు రవిశాస్త్రి తెలిపారు. 

మార్చి చివర్లో ప్రారంభంకానున్న ఐపిఎల్ 2019 టోర్నీ ప్రపంచ కప్ కు 10 రోజుల ముందు వరకు జరగనుంది. ఇందులో భారత ఆటగాళ్లందరు పాల్గొంటారు. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల ఆటగాళ్లు బాగా అలసిపోవడం, గాయాలపాలవడం జరుగుతుంది. దీంతో ప్రపంచ కప్ జట్టుపై ఆ ప్రభావం పడుతుందని రవిశాస్త్రి తెలిపారు. 

అందువల్ల  ఐపిఎల్ మూలంగా ఆటగాళ్లపై  పడే పనిభారాన్ని తగ్గించడానికి ఐపిఎల్ జట్ల యాజమాన్యాలతో, కెప్టెన్లతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటగాళ్ల ఫిట్ నెస్, ఫామ్ పై ప్రభావం పడకుండా చూడాల్సిందిగా కోరతామని అన్నారు.ముఖ్యంగా ప్రపంచ కప్ ఆడే అవకాశమున్న భారత ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు, ఒత్తిడికి గురికాకుండా చూడాలని సూచిస్తామని రవిశాస్త్రి తెలిపారు. 

వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు మంచి విశ్రాంతి అవసరమని...అప్పుడే వారి నుండి మంచి ప్రదర్శనను ఆశించవచ్చని రవిశాస్త్రి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫామ్ లో వున్నారు. న్యూజిలాండ్ పర్యటన ముగియగానే టీంఇండియా ఆటగాళ్లు స్వదేశంలో ఆస్ట్రేలియా సీరిస్ ఆ తర్వాత ఐపిఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే ప్రపంచచ కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రవిశాస్త్రి స్పష్టం చేశారు.  
  
click me!