నాలుగు రోజుల పాటు స్మిత్ ఏడుస్తూనే ఉండిపోయాడు

First Published Jun 5, 2018, 10:52 AM IST
Highlights

బాల్ టాంపరింగ్ వ్యవహారంలో పట్టుబడిన ఆస్ట్రేలియా  క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగు రోజులు ఏడ్చేశాడట.

సిడ్నీ: బాల్ టాంపరింగ్ వ్యవహారంలో పట్టుబడిన ఆస్ట్రేలియా  క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగు రోజులు ఏడ్చేశాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడు. బాల్ టాంపరింగ్ లో పట్టుబడిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి మీడియా సమావేశంలో అతను బోరున విలపించిన విషయం తెలిసిందే. 

బాల్ టాంపరింగ్ వ్యవహారంలో డేవిడ్ వార్నర్ తో పాటు స్టీవ్ స్మిత్ ను ఏడాది క్రికెట్ నుంచి నిషేధించారు. శిక్షలో సామాజిక సేవ కూడా భాగం కావడంతో సిడ్నీ బాలుర పాఠశాల కార్యక్రమానికి సోమవారం హాజరయ్యాడు. 

నిజాయితీగా చెప్పాలంటే తాను నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయానని అతను పిల్లలతో చెప్పాడు. మానసికంగా తాను చాలా దెబ్బ తిన్నానని, తనకు అది అతి కష్టమైన సందర్భమని అన్నాడు. 

తనకు కుటుంబసభ్యులు, మిత్రులు మద్దతు పలకడం తన అదృష్టమని అననాడు. ఉద్వేగాలను బయటపెట్టుకోవడం అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

click me!