వాళ్ల కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు.. షోయబ్

Published : Nov 13, 2018, 02:20 PM ISTUpdated : Nov 13, 2018, 02:24 PM IST
వాళ్ల కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు.. షోయబ్

సారాంశం

షార్జా వేదికగా ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న టీ10 లీగ్ కి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దూరమయ్యారు. 

షార్జా వేదికగా ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న టీ10 లీగ్ కి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దూరమయ్యారు. తాను కొంతకాలం కుటుంబంతో గడపాలని అనుకుంటున్నానని.. అందుకే ఈ  లీగ్ కి దూరంగా ఉంటున్నట్లు షోయబ్ తెలిపారు.

ఈ టీ10 లీగ్ లో మొత్తం 8 జట్లు గ్రూపులుగా విడిపోయి 11రోజుల పాటు ఈ టోర్నీ ఆడతాయి. స్‌ గేల్‌, మలింగ, షాహిద్‌ అఫ్రిది, బ్రెండన్‌ మెక్‌కలమ్‌, జహీర్‌ ఖాన్‌, షేన్‌ వాట్సన్‌, డారెన్‌ సామి, కీరన్‌ పొలార్డ్‌ వంటి దిగ్గజాలు ఈ టోర్నీలో ఆడనున్నారు. అయితే ఈ లీగ్‌లో పంజాబీ లెజెండ్స్‌కు సారథ్యం వహించనున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తాజాగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు.

‘కుటుంబంతో గడపాలనే కారణంతో టీ10 లీగ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నా. ఇది కఠిన నిర్ణయమే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా భార్య, కుమారుడికే సమయం కేటాయించాలనుకుంటున్నా. వారి కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ మాలిక్‌ ట్వీట్‌ చేశాడు. ఇటీవల సానియా, షోయబ్ దంపతులకు బాబు జన్మించిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

కివీస్‌తో సిరీస్.. ఇకపై ఆ ఇద్దరి ప్లేయర్స్‌ వన్డేలకు టాటా చెప్పేసినట్టే.. ఎవరంటే.?
టీమిండియా ఫ్యూచర్ కోహ్లీకి బుర్రుంది.! టెస్టుల్లో ఇలా చేస్తే మనల్ని ఎవడ్రా ఆపేది..