ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం: సెరెనా‌ ఓటమి, క్వార్టర్స్‌లోనే ఇంటికి

sivanagaprasad kodati |  
Published : Jan 23, 2019, 11:30 AM IST
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం: సెరెనా‌ ఓటమి, క్వార్టర్స్‌లోనే ఇంటికి

సారాంశం

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా చేతిలో ప్రపంచ మాజీ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది. ఇవాళ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 6-4, 4-6, 7-5 తేడాతో సెరెనా పరాజయం పాలైంది

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా చేతిలో ప్రపంచ మాజీ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది. ఇవాళ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 6-4, 4-6, 7-5 తేడాతో సెరెనా పరాజయం పాలైంది.

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. పుంజుకుని వెంటనే రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే చివరిలో విజయం ఇద్దరి మధ్యా దోబూచులాడినప్పటికీ ఫైనల్‌గానే ప్లెస్కోవానే విజయం వరించింది.

ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. కాగా, 2016 యూఎస్ ఓపెన్‌ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఓటమి పాలైంది. ఈ విజయంతో కరోలినా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత