వరల్డ్ కప్ వ్యూహం...హ్యాట్రిక్ విజయాల సారథి మళ్ళీ రంగంలోకి

By Arun Kumar PFirst Published Feb 8, 2019, 6:42 PM IST
Highlights

ప్రపంచ కప్...ప్రతి అంతర్జాతీయ క్రికెట్ జట్టు కల. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్ లో ప్రతి దేశం తమ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇలా ప్రపంచ దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొనాలని ప్రతి ఆటగాడు ఆశిస్తుంటాడు. తమ జట్టును ప్రపంచ ఛాంపియన్ గా నిలపడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఓ ఆటగాడు మాత్రం ఏకంగా వరుసగా మూడు ప్రపంచ కప్ విజయాలను తమ జట్టుకు అందించి హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత కూడా పలు సందర్భాల్లో తమ జట్టుకు సేవలందించాడు. తాజాగా ఈ ఏడాది జరగనున్న వరల్డ్ కప్ లో మరోసారి తమ జట్టును విన్నర్ గా నిలిపాలని తాపత్రయ పడుతున్నాడు. అతడే ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. 

ప్రపంచ కప్ టోర్నీల్లో మంచి రికార్డున్న మాజీ ఆటగాడు రికీ పాటింగ్ సేవలను మరోసారి ఉపయోగించుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావించినట్లుంది. అందుకోసం ప్రపంచకప్ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ను అసిస్టెంట్ కోచ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కు ఆసిస్ జట్టును వరల్డ్ కప్ కోసం సన్నద్దం చేయడం, ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా సలహాలు, సూచనలు ఇవ్వడంలో పాంటింగ్ సహాయపడనున్నాడు. 

పాంటింగ్ గతంలో కూడా ఆస్ట్రేలియా జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. 2017, 2018ల్లో తమ దేశ టీ20 జట్టుకు అతడు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే  గతేడాది ఇంగ్లండ్‌కు పర్యటన తర్వాత పాంటింగ్ ను ఆ పదవి నుండి తప్పిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. తాజాగా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మరొకసారి పాంటిగ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. 

Ricky Ponting at

1996: CWC debut
1999: 🏆
2003: 🏆
2007: 🏆
2011: Quarter-finalist
2019: Assistant coach!

➡️ https://t.co/HBDkpNWCdq pic.twitter.com/K6kx41tKT6

— ICC (@ICC)

click me!