
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రేమలో పడ్డారని.. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలపై రవిశాస్త్రి స్పందించారు. ’’ఈ వార్తలపై మాట్లాడటానికి కానీ.. చెప్పడానికి కానీ ఏం లేదు.. అవన్ని ఆవు పేడతో సమానం’’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు.
మరోవైపు నిమ్రత్ కూడా దీనిపై స్పందించారు.. తాను ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని.. ప్రేమ కోసం వెంపర్లాడటం లేదంటూ ట్వీట్ చేసింది. తనకు రూట్ కెనాల్ అవసరం అవుతుందేమోనని అనిపిస్తుందని.. తన గురించి వచ్చిన వార్తలు చాలా బాధపట్టాయని నిమ్రత్ ఆవేదన వ్యక్తం చేశారు.