Cricket: 145 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

Published : Jun 12, 2025, 11:57 AM IST
lowest-team-score-in-cricket

సారాంశం

డబ్ల్యూతీసీ ఫైనల్‌లో రబాడా ఐదు వికెట్లతో చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఇద్దరు ఓపెనర్లు డకౌట్ కావడం తొలిసారి.

145 ఏళ్ల టెస్ట్ చరిత్రలో…

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం నుంచే ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇరుజట్ల ఓపెనర్లు డకౌట్ కావడం అరుదైన సంఘటనగా నిలిచింది. 145 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇలాంటి విషయం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘటనం కేవలం పదిసార్లు మాత్రమే నమోదైంది.

రబాడా బంతులతో ప్రత్యర్థులను గడగడ..

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభించిన సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా బంతులతో ప్రత్యర్థులను గడగడలాడించాడు. అతను ఐదు కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కేవలం 212 పరుగులకే ఆపేశాడు. అతనితో పాటు మార్కో యాన్సెన్ మూడు వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడితప్పించాడు.

ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా ఆస్ట్రేలియా బౌలర్లు అదే వేగాన్ని చూపారు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా), ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) ఇద్దరూ డకౌట్ కావడం క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా మారింది.రబాడా మాత్రం ఈ మ్యాచ్‌లో ఘనతల పరంపరను కొనసాగించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 71 మ్యాచ్‌లలో 332 వికెట్లు తీసి, దక్షిణాఫ్రికా తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఆ గౌరవం అలెన్ డోనాల్డ్‌కు ఉండేది. అతను 330 వికెట్లు తీసి రిటైర్ అయ్యాడు.

ఇంకా రబాడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదే ఫీట్‌ను 2021లో న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమీసన్ భారత్‌పై సాధించాడు.

ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఐదు వికెట్లు సాధించిన సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా రెండో వ్యక్తిగా నిలిచాడు. ఈ ఘనతను 1998లో జాక్వస్ కలిస్ తొలిసారి అందుకున్నాడు. ఇక ఐసీసీ నిర్వహించిన ఐదు పెద్ద టోర్నీల్లో 11 వికెట్లు తీసిన రబాడా, లార్డ్స్ మైదానంలో కూడా అత్యధిక వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికన్ బౌలర్‌గా మోర్నే మోర్కెల్ (15 వికెట్లు) రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకు లార్డ్స్‌లో అతను 18 వికెట్లు తీశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashes 2025: అసలు రహస్యం అదే ! యాషెస్‌లో ఇంగ్లాండ్ ఓటమికి 3 షాకింగ్ కారణాలు !
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ