
ఒలింపిక్స్ లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు ఆట తీరుపై జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. సింధు ఆట అదిరిందని, ఆసాధారణ ప్రదర్శన కనబరిచిందని మెచ్చుకున్నారు.
పి.వి. సింధు విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది.
కాంస్యపతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివోతో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు, భారత్‌కి పతకాన్ని అందించింది. దీంతో కాంస్య పతకపోరులో బింగ్జియావో (చైనా)పై సింధు అన్ని రంగాల్లోనూ పై చేయి సాధించిందని తెలిపారు. సింధూ కాంస్యం గెలిచిన తరువాత పుల్లెల గోపీచంద్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
‘సింధు కాంస్యం గెలవడం చాలా ఆనందంగా ఉంది. అత్యుత్తమంగా ఆడింది.. మంచి ప్రదర్శన ఇచ్చింది. ఒలింపిక్స్ లలో పతకాలు సాధించడం గొప్ప ఘనత’ అని గోపీచంద్ అన్నారు. అంతేకాదు ‘వరుసగా మూడు ఒలింపిక్స్ లో భారత్ కు బ్యాడ్మింటన్ లో పతకాలు రావడం చాలా గొప్ప విషయం. ఇది సరికొత్త చరిత్ర. సింధు అద్వితీయంగా ఆడింది. రెండో ఒలింపిక్స్ పతకంతో అద్భుతం చేసింది. సింధు, ఆమె కోచ్, సహాయ సిబ్బంది కష్టానికి ఫలితం దక్కింది’ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్ లో సింధూ ఆటతీరుపై మాట్లాడుతూ.. తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో పోరులో తప్ప మితగా అన్ని మ్యాచుల్లోనూ సింధూ పూర్తి ఆధిపత్యంతో ఆడింది. ఆదివారం మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అటాకింగ్ లో సిందూ బ్రహ్మాండంగా ఆడింది. నెట్ దగ్గర చురుగ్గా కదిలింది. స్మాష్లు, క్రాస్ కోర్ట్ షాట్ లు పక్కాగా ఆడింది. కోర్టు నలువైపులా కదులుతూ షటిల్ ను అందుకుంది. అనవసర తప్పిదాలు ఎక్కువగా చేయలేదు. అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది.. అని వివరించి చెప్పుకొచ్చారు గోపీచంద్.
ఫిభ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ లలో టోర్నీలు లేకపోడం సింధూకు కలిసొచ్చిందని గోపీచంద్ అన్నారు. ఆ సమయంలో సింధు పూర్తిగా శిక్షణమీదై దృష్టి సారించింది. అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఆమె పడ్డ కష్టం ఫలించింది. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అండగా నిలిచింి. కేంద్ర ప్రభుత్వ పథకం ‘టాప్’ కలిసొచ్చింది. అడిగిన వెంటనే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియాన్ని శిక్షణకు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బాయ్, సాయ్ కు కృతజ్ఞతలు తెలిపారు గోపీచంద్.