ప్రో కబడ్డి 2019: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన యూ ముంబా... గుజరాత్ పై ఘనవిజయం

Published : Aug 02, 2019, 09:52 PM ISTUpdated : Aug 02, 2019, 10:02 PM IST
ప్రో కబడ్డి 2019: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన యూ ముంబా... గుజరాత్ పై ఘనవిజయం

సారాంశం

సొంత మైదానంలో ముంబై ప్రేక్షకుల ముందు జరుగుతున్న ప్రో కబడ్డి సీజన్ 7 చివరి లీగ్ మ్యాచ్ యూ ముంబా అదరగొట్టింది. గుజరాత్ పై ఏకంగా 12 పాయింట్ల ఆధిక్యంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  

 ప్రో కబడ్డి సీజన్ 7 లీగ్ దశలో భాగంగా సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ లో యూ ముంబా అదరగొట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ముంబై ప్రేక్షకుల సమక్షంలో గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ జట్టును మట్టికరిపించింది. గుజరాత్ కంటే ఏకంగా  12 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించిన ముంబై సొంత గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించుకుంది. 

ముంబై టీంలో అత్యధికంగా 9 పాయింట్లు సాధించి సురీందర్  సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అభిషేక్ సింగ్ 6, యంగ్ చాంగ్ 3, రోహిత్ 3, ఫజల్ 2, లీ డాంగ్ 2, అర్జున్ 1 పాయింట్లు సాధించారు. ఇలా ఆటగాళ్లందరు సమిష్టిగా రాణించి ముంబైకి  విజయాన్ని అందించారు. ముంబై రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 11, ప్రత్యర్ధిని ఆలౌట్ చేయడం ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లు సాధించింది. 

ఇక గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ టీంలో ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు హర్మజిత్ సింగ్ 4, మోరె 3, అంకిత్ 3, సోను 3 పాయింట్లతో పరవాలేదనిపించినా జట్టను విజయాన్ని అందించలేకపోయారు.  ఆ జట్టు రైండింగ్ లో10, ట్యాకిల్స్ లో 8, ఎక్స్‌ట్రాల రూపంలో 2 పాయింట్లతో కేవలం 20 పాయింట్లతోనే సరిపెట్టకుంది. దీంతో ముంబై 32-20 తేడాతో  ఘన విజయాన్ని సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు