యూఎస్ ఓపెన్ విజేత జకోవిచ్.. ముచ్చటగా మూడోసారి

By sivanagaprasad KodatiFirst Published 10, Sep 2018, 10:54 AM IST
Highlights

యూఎస్ ఓపెన్ టైటిల్‌ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. పురుషుల సింగిల్స్  ఫైనల్లో మాజీ విజేత అర్జెంటీనా టాప్ సీడ్ డెల్‌పొట్రోపై 6-3, 7-6, 6-3 తేడాతో విజయం సాధించాడు

యూఎస్ ఓపెన్ టైటిల్‌ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. పురుషుల సింగిల్స్  ఫైనల్లో మాజీ విజేత అర్జెంటీనా టాప్ సీడ్ డెల్‌పొట్రోపై 6-3, 7-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. జకోవిచ్ ముచ్చటగా మూడోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.

ఇప్పటి వరకు డెల్‌పొట్రో, జకోవిచ్‌లు 19 సార్లు తలపడగా.. 15 సార్లు జకోవిచ్‌నే విజయం వరించింది.  తాజా విజయంతో 14వ గ్రాండ్‌స్లామ్ తన ఖాతాలో వేసుకుని పీట్ సంప్రాస్ సరసన చేరాడు. ఈ జాబితాలో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Last Updated 19, Sep 2018, 9:17 AM IST