ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా కన్నుమూత

By telugu teamFirst Published May 21, 2019, 10:10 AM IST
Highlights

ఆస్ట్రియా ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

ఆస్ట్రియా ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఎఫ్‌-1 రేసర్‌గా పేరుగాంచిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తోటి రేసర్ల సాయంతో అప్పట్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకున్న ఆరు వారాల్లోనే తిరిగ రేసింగ్ పాల్గొని చరిత్ర సృష్టించిన ఘనత ఆయనది.   1949లో ఆస్ట్రియాలో జన్మించిన నిక్కీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో  ఫార్మాల్‌ వన్‌ రేసులో అత్యుత్తమ స్థాయి వరకు ఎదిగారు

click me!