నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు బిఎండబ్ల్యు కారు

Published : Sep 14, 2019, 08:52 PM IST
నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు బిఎండబ్ల్యు కారు

సారాంశం

చాముండేశ్వరినాథ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శనివారం దాన్ని పీవీ సింధుకు అందించారు.

హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధును అన్ని రంగాలవారు అభినందిస్తున్నారు. బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ విజేతగా పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు నజరానాలు ప్రకటిస్తున్నారు. 

మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ సింధుకు ఖరీదైన బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు కారును బహూకరించారు. 

దానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచినప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సింధుకు ఖరీదైన కారును బహూకరించారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది