ఐపీఎల్ చరిత్రలో.. ధోనీ నయా రికార్డ్

By telugu teamFirst Published Apr 22, 2019, 10:49 AM IST
Highlights

టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ రేసులో దూసుకుపోతోంది. 

టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ రేసులో దూసుకుపోతోంది. ఐపీఎల్ కి ముందు ధోనీ కాస్త ఢీలా పడినా.. ఇప్పుడు మాత్రం రాకెట్ లా దూసుకుపోతున్నాడు.

తన కెప్టెన్సీలో జట్టును గెలిపించడానికి ప్రయత్నిస్తూనే.. తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు.  ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అసమాన ఇన్సింగ్స్(48బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 84నాటౌట్) తో మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్లాడు. అయితే.. చివరి బాల్  ఉమేష్ యాదవ్ తెలివిగా విసరడంతో జట్టుకి ఓటమి తప్పలేదు.

మ్యాచ్ దక్కకపోయినా.. ధోనికి ఘనత దక్కింది. ఈ మ్యాచ్ లో ధోని ఏడు సిక్సర్లు బాదడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన ఫీట్ నమోదైంది. నిన్నటి ఇన్సింగ్స్ తో ఐపీఎల్ లో 200సిక్సర్లు కొట్టిన ఏకైకక భారత ఆటగాడిగా ధోని నిలిచాడుడ. ఇప్పటి వరకు జరిగిన 12సీజన్లలో ధోనీ 203 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్ గా అతడు మూడో స్థానంలో ఉన్నాడు. 

కాగా.. మొదటిస్థానంలో క్రిస్ గేల్(323), రెండో స్థానంలో డివిలియర్స్(204) ఉన్నారు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో కొట్టిన 84 పరుగులే ధోనీ టీ20 కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గత సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 79 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీన్ని నిన్నటి మ్యాచ్‌తో మెరుగుపరచుకున్నాడు. అలాగే, ధోనీ నాటౌట్‌గా ఉన్నా మ్యాచ్‌ ఓడిపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే. 2013లో ముంబై ఇండియన్స్‌పై, 2014, 2018లో పంజాబ్‌పై, తాజాగా బెంగళూరుపై ఇలా జరిగింది.

click me!