కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..

By telugu teamFirst Published Sep 26, 2019, 11:18 AM IST
Highlights

 భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సింధు కూడా... తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లిన సింధు, సైనాలు... కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో.. తొలి మ్యాచ్ కే వెనుదిరగడం గమనార్హం.

కొరియా ఓపెన్ లో ఇండియన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కశ్యప్ రెండో రౌండ్ కి చేరుకున్నాడు. పురుషుల సింగ్స్ లో కశ్యప్ తన సత్తా చాటాడు. నేడు జరిగిన తొలిరౌండ్‌ పోరులో కశ్యప్‌ 21-16, 21-16 పాయింట్ల తేడాతో లూ-ఛియా-హంగ్‌(చైనీస్‌ తైపీ)పై సునాయాసంగా గెలుపొందాడు. శక్యప్ ఫైనల్స్ వరకు చేరుకొని భారత్ పరువు నెలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం కొరియా ఓపెన్ లో భారత్ కి మిగిలిన ఒకే ఒక్క ఆశాజనం కశ్యప్.

కాగా... భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సింధు కూడా... తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లిన సింధు, సైనాలు... కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో.. తొలి మ్యాచ్ కే వెనుదిరగడం గమనార్హం.

బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సింధు చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ చేతిలో 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్‌ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం సులభంగా ఓటమిపాలవ్వడం గమనార్హం. 

click me!