జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

sivanagaprasad kodati |  
Published : Dec 18, 2018, 01:55 PM IST
జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

సారాంశం

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్వల్పంగా మాటల యుద్ధం జరిగింది. అయితే ఆసక్తికరంగా టీమిండియా క్రికెటర్లు ఇషాంత్, జడేజా మధ్య గొడవ జరిగి.. జడేజాను శర్మ కొట్టబోయాడట. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. నాలుగో రోజు ఆటలో భాగంగా సోమవారం భారత జట్లు ఫీల్డింగ్ చేస్తోంది. ఈ సమయంలో ఫీల్డింగ్ కూర్పులో భాగంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అది తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ చేయి చేసుకునేలా కనిపించాడు. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ వీరిపై మండిపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం
విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల జోరు.. దెబ్బకు సెలెక్టర్లు బేజారు..