రఫెల్ నాదల్ ఓటమి...ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్

Published : Jan 27, 2019, 04:31 PM ISTUpdated : Jan 27, 2019, 05:17 PM IST
రఫెల్ నాదల్ ఓటమి...ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్

సారాంశం

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెర్బియా ఆటగాడు జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. రఫెల్ నాదల్‌తో జరిగిన ఫైనల్లో 6-3, 6-2, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ విజయంతో జకోవిచ్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, నాదల్‌ 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెర్బియా ఆటగాడు జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో స్పెయిన్ క్రీడాకారుడు, ప్రపంచ మాజీ చాంపియన్ రఫెల్‌నాదల్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

6-3, 6-2, 6-3 సెట్ల తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ విజయంతో జకోవిచ్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ఏడు సార్లు ఫైనల్ చేరి ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా ఎమర్సన్, రోజర్ ఫెదరర్ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత