రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా... వచ్చే ఫిబ్రవరితో సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు...

By Chinthakindhi Ramu  |  First Published Jan 7, 2023, 3:30 PM IST

ఫిబ్రవరిలో దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీతో కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా... 19 ఏళ్లుగా ప్రొషెషనల్ టెన్నిస్‌లో కొనసాగుతున్న సానియా... 


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎట్టకేలకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలుకుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 36 ఏళ్ల సానియా మీర్జా, దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తనకి చివరిదని తెలియచేసింది...

తన కెరీర్‌లో ఆరు సార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా, రెండు దశాబ్దాలుగా ఇండియా టాప్ సీడెడ్ ప్లేయర్‌గా కొనసాగింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచిన సానియా మీర్జా... గత ఏడాది చివర్లోనే రిటైర్మెంట్ గురించి ప్రకటన చేసింది...

Latest Videos

అయితే గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా, 2023 ఆస్ట్రేలియా ఓపెన్‌లో రోహాన్ బోపన్నతో కలిసి బరిలో దిగబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఫేర్‌వెల్ టోర్నీగా దుబాయ్ ఓపెన్‌లో బరిలో దిగనుంది...

‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ తర్వాత ఆట నుంచి తప్పుకోబోతున్నా. యూఎస్ ఓపెన్‌కి ముందు నా మోకాలికి గాయమైంది. కాబట్టి అన్ని ప్లాన్స్‌ని మార్చుకోవాల్సి వచ్చింది. టెన్నిస్ నాకెంతో ఇచ్చింది. నా లిమిట్స్ ఏంటో నాకు బాగా తెలుసు. గాయమైనా మొండిగా ఆడడం వల్ల మొదటికే మోసం వస్తుంది. నూరు శాతం ఇవ్వలేం. అందుకే గాయం మానేదాకా ఎదురుచూసి తిరిగి రాకెట్ పట్టాను.. ’ అంటూ తెలియచేసింది సానియా మీర్జా...

ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్స్‌లో వుమెన్స్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది.  కెరీర్‌లో‌ ఎన్నో విమర్శలు, అంతకుమించి ఆరోపణలు వచ్చినా... వివాదాలు వెంటాడినా అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంది సానియా మీర్జా... 

ఒలింపిక్స్ మెడల్ గెలవాలనే కలను నెరవేర్చుకోవాలనే ఆశతో టోక్యోలో అడుగుపెట్టిన సానియా మీర్జా, రెండో రౌండ్‌లో ఓడి ఇంటి దారి పట్టింది. అయితే ఆ తర్వాత చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022 టోర్నీలో ఆడిన సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి ఫైనల్ చేరి, వుమెన్స్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది...

2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా మీర్జా, తన 19 ఏళ్ల  టెన్నిస్ కెరీర్‌లో ఎన్నో సంచలన విజయాలు అందుకుంది. సింగిల్స్‌లో అత్యధికంగా 27వ ర్యాంకుకి చేరుకున్న సానియా మీర్జా, డబుల్స్‌లో 2015లో వరల్డ్ నెం.1 ర్యాంకును పొందింది... 

click me!