ఆసియా క్రీడల్లో చేజారిన స్వర్ణం...ఆర్చరీలో సిల్వర్ మెడల్ కైవసం

By Arun Kumar PFirst Published Aug 28, 2018, 2:46 PM IST
Highlights

ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం తృటిలో చేజారింది. పురుషుల ఆర్చరీ టీం ఈవెంట్ లో భారత క్రీడాకారులు అద్భుతంగా తలపడినప్పటికి విధి వారికి సహకరించలేదు. దీంతో ఫైనల్లో ఓటమిపాలై సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఆసియా క్రీడల్లో పురుషుల ఆర్చరీ టీం ఈవెంట్ లో భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమల్ సైనీలు సౌత్ కొరియా జట్టుతో తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు సేమ్ స్కోర్ ను సాధించడంతో టై అయ్యింది. ఇరుజట్లు 24 షాట్లలో 229 పాయింట్లు సాధించాయి. దీంతో షూట్ ఆఫ్ ను నిర్వహించగా అందులోను ఇరుజట్లు సమానమైన పాయింట్లు సాధించారు.

దీంతో నిర్వహకులు ఖచ్చితమైన షాట్లను బట్టి విజేతను ప్రకటించారు. ఇండియన్ టీం కంటే కొరియా జట్టు ఎక్కువ ఖచ్చితమైన షాట్లు ఆడటంతో విజేతగా నిలించింది. దీంతో భారత జట్టు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో కూడా పివి.సింధు ఓటమిపాలయ్యారు. దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే మహిళా ఆర్చరీలో కూడా రజత పతకమే లభింంచిన విషయం తెలిసిందే. 
 
click me!