Published : Sep 10, 2025, 06:58 PM ISTUpdated : Sep 10, 2025, 09:57 PM IST

Asia Cup 2025, IND vs UAE Live: ఆసియా కప్ 2025 ఇండియా vs యూఏఈ లైవ్ అప్డేట్స్

సారాంశం

Asia Cup 2025, IND vs UAE Live: ఆసియా కప్ 2025 లో భాగంగా బుధవారం భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోటీ పడుతున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Asia Cup 2025 IND vs UAE Live Score Updates from Dubai

09:57 PM (IST) Sep 10

యూఏఈపై భారత్ ఈజీ విక్టరీ

భారత్ ఘన విజయం.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో గెలుపు

యూఏఈ  చేసిన 57 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సులభంగా చేధించింది. కేవలం 4.3 ఓవర్లలోనే 60/1 స్కోర్ చేసి మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచింది.

 

09:21 PM (IST) Sep 10

యూఏఈ 57 పరుగులకే ఆలౌట్

భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతోయూఏఈ ఇన్నింగ్స్ కేవలం 57 పరుగులకే ముగిసింది.

జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే బౌలింగ్ దాడికి యూఏఈ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు.

తొలుత అలీషన్ శరఫు మంచి ఆరంభం ఇచ్చినా, బుమ్రా యార్కర్‌తో ఔట్ చేయడంతో దెబ్బతిన్న యూఏఈ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వరుణ్, కుల్దీప్ తాకిడితో స్కోర్‌బోర్డ్ ముందుకు కదల్లేకపోయింది.

యూఏఈ — 57/10 (13.1)

ఇప్పుడు భారత్ జట్టుకు లక్ష్యం కేవలం 58 పరుగులు మాత్రమే.

09:01 PM (IST) Sep 10

శివమ్ దూబేకు వికెట్

భారత బౌలింగ్ దాడిలో యూఏతో 6వ వికెట్ ను కోల్పోయింది. శివమ్ దూబే అసిఫ్ ఖాన్ ను అవుట్ చేశాడు. అతను వికెట్‌కీపర్ సంజూ శాంసన్ కు క్యాచ్ గా దొరికిపోయాడు.

స్కోర్: UAE 53/7 (11.4) CRR: 4.54

08:59 PM (IST) Sep 10

కుల్దీప్ హ్యాట్రిక్‌ ఓవర్.. కష్టాల్లో యూఏఈ

కుల్దీప్ యాదవ్ మాయాజాల బౌలింగ్‌తో యూఏఈ బ్యాటర్లను ఒక్కోకరిని వెనక్కి పంపిస్తున్నాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి టీమిండియాకు భారీ ఆధిక్యం అందించాడు.

హర్షిత్ కౌశిక్ (2)ను బౌల్డ్ చేస్తూ తన మూడో వికెట్ ను సాధించాడు.

9వ ఓవర్ స్కోర్‌కార్డ్: W 1 0 W 2 W

మూడు వికెట్లు కూల్చిన అద్భుత ఓవర్‌తో యూఏఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.

స్కోర్: యూఏఈ – 50/5 (9 ఓవర్లు)

 

 

 

08:45 PM (IST) Sep 10

కుల్దీప్ డబుల్ స్ట్రైక్.. వరుస వికెట్లు కోల్పోయిన యూఏఈ

ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈకి కష్టాలు తెచ్చిపెట్టాడు. 8.1 ఓవర్లో కుల్దీప్ యాదవ్ తొలి వికెట్ సాధించాడు. రాహుల్ చోప్రా (3)ను ఔట్ చేశాడు. తర్వాత అదే ఓవర్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. 8.4 ఓవర్లో యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీమ్ (19)ను అవుట్ చేశాడు.

స్కోర్: యూఏఈ – 48/4 (8.4 ఓవర్లు)

 

 

 

08:41 PM (IST) Sep 10

పవర్‌ప్లే సమ్మరీ.. యూఏఈ ఇన్నింగ్స్

 

• అలీషాన్ శరఫు యూఏఈ కి మంచి ఆరంభం ఇచ్చారు

• పాండ్యా తొలి ఓవర్‌లో 10 పరుగులు, అక్షర్ 9 పరుగులు ఇచ్చారు

• 3.4 ఓవర్లో బుమ్రా యార్కర్‌తో శరఫును బౌల్డ్ చేశారు

• 4.4 ఓవర్లో వరుణ్ చక్రవర్తి జొహైబ్‌ను ఔట్ చేశారు

• పవర్‌ప్లేలో బుమ్రా మూడు ఓవర్లు వేశారు

• బుమ్రా మూడో ఓవర్‌లో వసీమ్ మూడు బౌండరీలు బాదారు

• ఆ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో యూఏఈ పవర్‌ప్లే ముగింపు కొంత మెరుగ్గా కనిపించింది

08:33 PM (IST) Sep 10

తొలి ఓవర్ లోనే వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి

వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. మహ్మద్ జొహైబ్ (2)ను ఔట్ చేసి భారత జట్టుకు రెండో వికెట్ ను అందించాడు. రెండు పరుగులు చేసిన వెంటనే జొహైబ్ బిగ్ షాట్ ఆడబోయాడు. అయితే మిస్టరీ స్పిన్నర్‌ను చదవడం సులభం కాదు. ఫుల్ లెంగ్త్‌లో వేసిన బంతిని బలంగా ఆడేందుకు ప్రయత్నించగా, అతను లైన్‌ను తప్పుగా అంచనా వేశాడు. బ్యాట్ ఎడ్జ్ తగిలి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద నుంచి కుల్దీప్ యాదవ్ కుడివైపు పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

యూఏఈ – 29/2 (4.4 ఓవర్లు)

 

08:31 PM (IST) Sep 10

బుమ్రా బాల్ గర్జన..

జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన యార్కర్‌తో అలీషాన్ (22) బౌల్డ్ చేశాడు.

బుమ్రా తన వేగం, ఖచ్చితత్వాన్ని చూపించాడు. ఆఫ్‌స్టంప్‌పై వేసిన పర్ఫెక్ట్ యార్కర్‌ను అలీషాన్ ఆపలేకపోయాడు. స్టంప్‌లు ఎగిరిపడ్డాయి.

అలీషాన్ 17 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్ల సహాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

యూఏఈ – 26/1 (3.4 ఓవర్లు)

 

07:40 PM (IST) Sep 10

టీమిండియా ప్లేయింగ్ 11

  1.  అభిషేక్ శర్మ
  2.  శుభ్‌మన్ గిల్
  3.  సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
  4.  తిలక్ వర్మ
  5.  సంజు శాంసన్ (వికెట్ కీపర్)
  6.  శివమ్ దూబే
  7.  హార్దిక్ పాండ్యా
  8.  అక్షర్ పటేల్
  9.  కుల్దీప్ యాదవ్
  10.  జస్ప్రీత్ బుమ్రా
  11.  వరుణ్ చక్రవర్తి

07:38 PM (IST) Sep 10

టాస్ గెలిచిన భారత్

టాస్ అప్‌డేట్: భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా కొత్తగా, బాగుంది. ఈ రోజు వాతావరణం తేమగా ఉంది, తరువాత మంచు ప్రభావం ఉండవచ్చు. మాకు అవకాశం వస్తే, దేనికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఈ రోజు మాత్రం బౌలింగ్ చేయాలనుకున్నాం. మేము ఇక్కడికి ముందుగానే వచ్చాం, 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాం, ఒక రోజు విశ్రాంతి కూడా తీసుకున్నాం” అని చెప్పారు.

యూఏఈ కెప్టెన్ వసీమ్ మాట్లాడుతూ..  “మేము కూడా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. పిచ్ కొత్తగా ఉంది, ఆరంభంలో బంతి ఏదైనా చేయవచ్చు. మేము మంచి సిరీస్ ఆడాం, చాలా సానుకూల అంశాలను తీసుకున్నాం, ఆ సిరీస్ నుండి మా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది” అని చెప్పారు.

07:21 PM (IST) Sep 10

దుబాయ్ పిచ్ ఎలా ఉండనుంది? భారత్ పరుగుల సునామీ ఉంటుందా?

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు రికార్డులు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పాలి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీ20 ఫార్మాట్‌లో భారత్ గెలుపు శాతం 55.55 గా ఉంది. అయితే, టోర్నమెంట్‌లో టీమిండియా చాలా బలంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా, భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. 2021 నుండి భారత జట్టు ఇక్కడ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది, 5 గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమతుల్యంగా ఉంటుంది. అయితే, ఈ విషయంలో బౌలర్లతో కాస్త పైచేయిగా ఉంది. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న జట్లు ఎక్కవ మ్యాచ్ లను గెలిచాయి.

 

 

07:11 PM (IST) Sep 10

భారత్ ప్లేయింగ్ XI (అంచనా):

శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

07:04 PM (IST) Sep 10

భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లైవ్

ఆసియా కప్ 2025 లో బ్యాలెన్స్, ఆల్-రౌండ్ డెప్త్‌తో భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో బుధవారం దుబాయ్‌లో తలపడుతోంది. కోచ్ గౌతమ్ గంభీర్ మల్టీ-స్కిల్డ్ ఆటగాళ్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. కాబట్టి 8వ స్థానం వరకు బ్యాటింగ్ బలంగా ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో జరగబోయే హై-ప్రొఫైల్ మ్యాచ్‌కి ఇది ఒక రిహార్సల్ లాంటిది.

దుబాయ్‌లోని ప్రస్తుత పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో భారత్ బ్యాటర్లకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. జట్టులో మూడో స్పిన్నర్ కావాలా లేక అదనపు పేసర్ కావాలా అనేది అతిపెద్ద ప్రశ్న. 8వ స్థానంలో అక్షర్ పటేల్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉంటారు. ఇక చివరి బౌలింగ్ స్థానానికి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉండవచ్చు.

గిల్ తిరిగి రావడంతో సంజు శాంసన్‌కు చోటు దక్కడం కష్టమే. తిలక్ వర్మ 3వ స్థానంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ లేదా 4వ స్థానంలో ఉంటారు. ఇక హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అలాగే ఫినిషర్ జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్‌కు అదనపు బలాన్ని అందిస్తారు.


More Trending News