ICC World Cup 2023: సెమీస్ లో పరుగుల సునామీ  ఖాయమా?.. వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి?  

By Rajesh Karampoori  |  First Published Nov 15, 2023, 12:13 PM IST

IND Vs NZ Semi-Final:ముంబైలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమా? ఈ పిచ్ బ్యాటింగ్ చేయడానికి అనుకూలమా? బ్యాట్స్ మెన్స్ పరుగుల సునామీ సృష్టించే అవకాశం ఉందా? గత రికార్డు ఏం చెబుతున్నాయి.


IND Vs NZ Semi-Final: "ఇదీ రణరంగం.. ఇదీ క్రీడా చదరంగం.. జరగాల్సిందే ఇక విధ్వంసం.." అన్నట్టు టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచ్ లో ఓటమి అంటూ ఎరుగని జట్టుగా టీమిండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. క్రికెట్ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తొలి సెమీఫైనల్ లో భారత్- న్యూజిలాండ్ మధ్య పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. ఈ ఆసక్తికర పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కానునున్నది. కాగా.. ప్రపంచకప్ సెమీస్‌లో ఈ ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ప్రపంచకప్ నుండి నిష్క్రమించింది. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  
ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ 160 పరుగుల భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రోహిత్ సేన ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అదే సమయంలో.. న్యూజిలాండ్ మొదటి నాలుగు మ్యాచ్‌లలో గెలిచింది. కానీ, తరువాతి నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ తరుణంలో పిచ్ ఎలా ఉంటుంది ? గత రికార్డులు ఏం చెబుతున్నారు ? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. 

పరుగుల సునామీ తప్పదా ?

Latest Videos

undefined

ముంబైలోని వాంఖడే స్టేడియం అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లకు పెట్టింది పేరు. బ్యాటింగ్ చేయడానికి ఈ పిచ్ చాలా అనుకూలంగా ఉండటంతో బ్యాట్స్ మెన్స్ పరుగుల సునామీ సృష్టించే అవకాశం ఉంది. క్రీడా విశ్లేకుల ప్రకారం.. ఈ సెమీస్ పోరులో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మాత్రం.. తొలుత ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. ఈ వరల్డ్ కప్ లో వాంఖడే గణాంకాలను పరిశీలిస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీం లే గెలుపొందాయి. కానీ, ఒక ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా- బంగ్లా మధ్య పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 382 పరుగులు చేసింది. తదుపతి లక్ష్య చేధనకు బరిలో దిగిన బంగ్లాను 149 పరుగుల తేడాతో ఓడించింది. సూపర్ విక్టరీని తన ఖాతా వేసుకుంది సఫారీ జట్టు.  అదే విధంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 399 పరుగులు చేయగా.. ఆ తరువాత లక్ష్య చేధనకు వచ్చినా ఇంగ్లాండ్ టీం కేవలం 170 పరుగులకే బ్యాగ్ సర్దేసింది. ఇక టీమిండియా - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేనా 357 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్ లో 55 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ అయ్యింది. 

కానీ.. ఆస్ట్రేలియా- అఫ్గాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఈ ఫార్ములా వర్క అవుట్ కాలేదనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా టీంలో మ్యాక్స్ వెల్ వీరంగం చేయడంతో ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని గెలుపు ఖాతాలో వేసుకుంది. ఈ గణాంకాల ప్రకారం.. వాంఖడే స్టేడియంలో మాత్రం.. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే అనుకులిస్తోందని భావిస్తున్నారు.

ఇక గత రికార్డులను పరిశీలిస్తే.. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 261 పరుగులు కాగా.. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి జట్టు 14 మ్యాచ్‌లు గెలవగా.. 13 జట్టు మ్యాచ్‌లు లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా విజయం సాధించాయి. వాంఖడే స్టేడియంలో అత్యధిక స్కోరు 2015లో ఆతిథ్య భారత్‌పై దక్షిణాఫ్రికా 438/4 పరుగులు చేసింది.  

ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఈ పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. షార్ట్ బౌండరీ లైన్ ఉండటంతో స్పిన్ బౌలర్లకు ఇబ్బందే అని చెప్పాలి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు ఎంతగానో సహకరిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ అడ్వాన్​టేజ్ గత మ్యాచ్ లో కలిసి వచ్చింది. అందుకే  55 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది టీమిండియా.ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా నేడు ఆడే తొలి సెమీఫైనల్స్ మ్యాచ్ లో రోహిత్ సేన టాస్ గెలువాలనీ, తొలుత బ్యాటింగ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  

click me!