హర్బజన్ పై విండీస్ మాజీ పేసర్ టీనో బెస్ట్ ఆగ్రహం

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 12:53 PM IST
Highlights

విండీస్ జట్టు ఆట తీరు చూస్తుంటే వారు కనీసం రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌కు కూడా చేరేటట్టు కనిపించడం లేదని, అందరినీ ఇప్పుడిదే ప్రశ్న వేధిస్తోందని వ్యంగ్యాస్త్రం విసారారు.

రాజ్ కోట్ తొలి టెస్టు మ్యాచులో వెస్టిండీస్ బ్యాటింగ్ పై హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్ పై విండీస్ మాజీ పేసర్ టీనో బెస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల రాజ్ కోట్ లో భారత్ కి విండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ పేలవ ప్రదర్శన కారణంగా భారత్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే.. ఈ నేపథ్యంలో విండీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ.. హర్బజన్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. విండీస్ జట్టు ఆట తీరు చూస్తుంటే వారు కనీసం రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌కు కూడా చేరేటట్టు కనిపించడం లేదని, అందరినీ ఇప్పుడిదే ప్రశ్న వేధిస్తోందని వ్యంగ్యాస్త్రం విసారారు. ఈ కామెంట్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అయ్యారు. 

కేవలం వెస్ట్ ఇండీస్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా.. ఇండిన్స్ కూడా బజ్జీ ట్వీట్ పై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో బజ్జీ  చేసిన ట్వీట్ విండీస్ మాజీ పేసర్ టీనో బెస్ట్ కి ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. 

read more news

హర్భజన్ సింగ్ ట్వీట్ పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

click me!