క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మాజీ ఆల్ రౌండర్

By ramya neerukondaFirst Published Jan 24, 2019, 2:09 PM IST
Highlights

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జోహాన్ బోథా క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. 

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జోహాన్ బోథా క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు జోహాన్ తాజాగా ప్రకటించాడు. ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ లో భాగంగా హోబార్ట్ హరికేన్స్ కి ప్రాతినిథ్యం వహించిన బోథా బుధవారం సిడ్నీ సిక్సర్స్ తో మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 

2005 నుంచి 2012 వరకూ దక్షిణాఫ్రికా జట్టు ప్రాతినిథ్యం వహించగా, 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాడు. దక్షిణాఫ్రికా తరఫున 78 వన్డే మ్యాచ్‌లు, 40 టీ20 మ్యాచ్‌లు, 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.  ఈ క్రమంలోనే 10 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లో బోథా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1తో ఆసీస్‌పై గెలిచి టాప్‌ ర్యాంకును సొంతం చేసుకుంది.  ఇదిలా ఉంచితే, పలు సందర్భాల్లో భోథా యాక్షన్‌పై అనుమానాలు తలెత్తడంతో అతని బౌలింగ్‌ను సరిచేసుకోవాల్సి వచ్చింది.

click me!