నూతన సంవత్సరంలో ఆసిస్ ఆ కొత్త ప్రయోగం చేయాలి: రికీ పాంటింగ్

By Arun Kumar PFirst Published Jan 1, 2019, 3:54 PM IST
Highlights

స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో భారత్ దెబ్బకు ఆస్ట్రేలియా వెనుబడిపోయింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్ 2-1 తేడాతొ ఆసిస్ కంటే ముందుంది. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఆసిస్ నూతర ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడి విషయంలో మార్పులు చేయాలని పాంటింగ్ సూచించాడు. 

టెస్ట్ ఫార్మాట్ లో ఓపెనర్ గా ఆరోప్ పించ్ కు చాలా అవకాశాలు లభించాయని...అయితే వాటిని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని పాంటింగ్ అన్నారు. కాబట్టి ఫించ్ భారత్ తో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్ట్ నుండి తప్పించాలని సూచించాడు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ మార్నస్ ను తీసుకుంటే మంచి ఫలితం వస్తుందని పాటింగ్ అభిప్రాయపడ్డారు. 

నూతన సంవత్సరంలో జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. ఉస్మాన్ ఖవాజాకు తోడుగా మార్నస్ ను ఓపెనర్ గా బరిలోకి దింపాలని.... ఈ ప్రయోగం ఆసీస్ కు లాభాన్ని చేకూరుస్తుందని పాటింగ్ తెలిపారు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌కు తగ్గట్లు ఆసిస్ జట్టు మరికొన్ని భిన్నమైన ఆలోచనలతో బరిలోకి దిగి భారత్ చేతికి టెస్ట్ సీరిస్ పోకుండా చూడాలని పాంటింగ్ అన్నాడు. 

click me!