కామన్వెల్త్ గేమ్స్ 2022: పసిడి పట్టుబట్టిన రవికుమార్ దహియా... భారత్ ఖాతాలో మరో గోల్డ్...

By Chinthakindhi RamuFirst Published Aug 6, 2022, 10:20 PM IST
Highlights

భారత్‌కి ఇది 10వ స్వర్ణం... నైజీరియా రెజ్లర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న ఒలింపిక్ మెడలిస్ట్...

టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, భారత రెజ్లర్ రవికుమార్ దహియా... కామన్వెల్త్ గేమ్స్ 2022లో పసిడి పట్టు పట్టాడు. 57 కేజీల విభాగంలో బరిలో దిగిన రవికుమార్ దహియా, రెండు సార్లు కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, నైజీరియా రెజ్లర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్నాడు... కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కి ఇది 10వ స్వర్ణం... రెజ్లింగ్‌లో నాలుగో గోల్డ్ మెడల్... 

RAVI WINS G🔥LD 😍

3 time Asian Champion & Olympics 🥈 medalist 🤼‍♂️ (M-57kg) has now conquered the , winning GOLD 🥇on his debut 🤩

Brilliant Gutwrench & winning by technical superiority, that's stoic & determined RAVI for you 😇
1/1 pic.twitter.com/UhLFq7c8od

— SAI Media (@Media_SAI)

వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన భారత్, వుమెన్స్ లాన్ బౌల్స్ ఈవెంట్‌లో, టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో, పారా పవర్ లిఫ్టింగ్‌లో ఒక్కో గోల్డ్ మెడల్ గెలిచింది.  మొత్తంగా 10 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలు గెలిచిన భారత్, 32 పతకాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

అంతకుముందు 50 కేజీల మహిళల రెజ్లింగ్ కాంస్య పతక పోరులో స్కాట్లాండ్ రెజ్లర్‌ లెచిజోతో జరిగిన మ్యాచ్‌లో 12-2 తేడాతో విజయం అందుకుంది భారత రెజ్లర్ పూజా గెహ్లాట్.. అండర్ 23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన పూజా గెహ్లాట్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ కూడా...

వుమెన్స్ బాక్సింగ్‌లో 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా కాంస్య పతకం సాధించింది. ఇంగ్లాండ్ బాక్సర్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిన జాస్మిన్ లంబోరియా... కాంస్యంతో సరిపెట్టుకుంది. 

టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ ప్లేయర్ మానికా బత్రా పోరాటం ముగిసింది. కామన్వెల్త్ మెడల్ లక్ష్యంగా బరిలో దిగిన మానికా బత్రా... వుమెన్స్ సింగిల్స్‌, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్‌లలో క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్‌లో, టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మానికా బత్రా, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. ఈ సారి మాత్రం పతకం లేకుండానే ఇంటిదారి పట్టింది మానికా...

మరో సీనియర్ టీటీ ప్లేయర్ శరత్ కమల్, మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ ఈవెంట్లలో ఫైనల్‌కి ప్రవేశించి రెండు పతకాలు ఖాయం చేసుకున్నాడు. సాథియన్‌తో కలిసి మెన్స్ డబుల్స్‌ ఆడిన శరత్ కమల్, ఆస్ట్రేలియా జోడీ నికోలస్ లమ్, ఫెన్ లూపై 3-2 తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరాడు...

మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీజ ఆకులతో కలిసి బరిలో దిగిన శరత్ కమల్, ఆస్ట్రేలియా మిక్స్‌డ్ జోడీ నికోలస్ లమ్- మిన్హుండ్ జీపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌ చేరాడు.  

స్వ్కాష్‌ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో భారత సీనియర్లు దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్, న్యూజిలాండ్ జోడీ జెల్లీ కింగ్, పాల్ కోల్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో పరాజయం పాలైంది. 2018లో న్యూజిలాండ్ జోడీని చిత్తు చేసిన భారత మిక్స్‌డ్ జోడీ, ఈసారి ఆ ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది. రేపు కాంస్య పతకం కోసం పోటీపడనుంది దీపికా, సౌరవ్ జోడీ...
 

click me!