
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్ లో అరీనా సబలెంకా, కోకో గౌఫ్ తలపడ్డారు. ప్రపంచ టాప్ సీడ్ ప్లేయర్ల మధ్య ఫైనల్ పోరు ఉత్కంఠగా సాగింది. 2013 తర్వాత జరిగిన మొదటి ఫైనల్, 35 సంవత్సరాలలో ఐదవసారి టాప్ 2 ర్యాంకు ప్లేయర్లు ఫైనల్‌లో తలపడ్డారు. ఈ ఉత్కంఠ పోరులో కోకో గౌఫ్ విజయం సాధించింది.
అమెరికా యువ సంచలనం కోకో గౌఫ్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అగ్రశ్రేణి బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకాపై 6-7, 6-2, 6-4 తేడాతో విజయం సాధించి గాఫ్ కెరీర్‌లో మరో గ్రాండ్ స్లామ్ జయాన్ని నమోదు చేసింది.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు అద్భుతంగా పోటీ పడ్డారు. అయితే, టైబ్రేక్‌లో సబాలెంకా 7-6 (7-4) తేడాతో ఆధిక్యం దక్కించుకుంది. అయితే రెండవ సెట్లో కోకో గౌఫ్ తన ఆటను మలుపు తిప్పింది. శక్తివంతమైన సర్వ్‌లు, షాట్స్ తో పూర్తి ఆధిపత్యంతో 6-2తో సెట్‌ను దక్కించుకుంది.
నిర్ణయాత్మక మూడో సెట్లో, రెండువైపులా నెర్వ్‌లతో కూడిన ఆట కొనసాగింది. ఓ దశలో సబాలెంకా బ్రేక్ పాయింట్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లేలా కనిపించింది. కానీ కోకో గౌఫ్ స్టడీగా, కూలుగా ఆడింది. ఒక దశలో ఛాంపియన్‌షిప్ పాయింట్‌లో కోకో గౌఫ్ టాప్-స్పిన్ ఫోర్‌హ్యాండ్‌తో గేమ్‌ను మలుపు తిప్పగా, సబాలెంకా అద్భుత షాట్‌తో దాన్ని సేవ్ చేసింది.
ఆ తర్వాత బ్రేక్ పాయింట్ దక్కించుకున్న సబాలెంకా రెండవ సర్వ్‌పై బెట్ వేసి అవుట్ అయింది. డ్యూస్ వద్ద కోకో గౌఫ్ మరోసారి మెరుపు సర్వ్ విసిరింది. ఆపై చివరి సర్వ్ లో గాఫ్ షాట్ తడబడినట్టు అనిపించినా, అది కోర్టులోనే పడింది. చివరి ప్రయత్నంగా బాల్‌ను హిట్ చేసిన సబాలెంకా నెట్‌లో బంతిని కోల్పోయింది.
ఈ విజయం తర్వాత కోకో గౌఫ్ 21 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న అరుదైన అమెరికన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె సానుకూల దూకుడు, మానసిక స్థైర్యం ఈ టైటిల్‌ను గెలిచే దిశగా దోహదం చేశాయి.
గాఫ్ నైపుణ్యం, పట్టుదల పట్ల అభిమానులు, నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కోకో గౌఫ్ టెన్నిస్ ప్రపంచంలో సంచలనంగా మారింది.
బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా, 27 సంవత్సరాల వయస్సుతో తన కెరీర్‌లో 19 WTA సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆమె 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించింది. 2024 యూఎస్ ఓపెన్ టైటిల్‌తో పాటు, ఆమె 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో, ఆమె ఐగా స్వియాటెక్‌ను 6-0, 3-6, 6-0 స్కోరుతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
అమెరికాకు చెందిన కోకో గౌఫ్, 21 సంవత్సరాల వయస్సుతో తన కెరీర్‌లో 10 WTA సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆమె 2023 యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. 2022 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్న కోకో గౌఫ్, ఈసారి మరింత అనుభవంతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో, ఆమె మాడిసన్ కీస్‌ను 6-3, 6-4 స్కోరుతో ఓడించింది.
అరీనా సబలెంకా, కోకో గౌఫ్ మధ్య ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, కోకో గాఫ్ 5 విజయాలు సాధించగా, అరీనా సబలెంకా 4 విజయాలు సాధించింది. 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో, కోకో గౌఫ్ 2-6, 6-3, 6-2 స్కోరుతో విజయం సాధించింది. 2024 WTA ఫైనల్స్ సెమీఫైనల్‌లో కూడా కోకో గౌఫ్ 7-6(4), 6-3 స్కోరుతో గెలిచింది. 10 మ్యాచ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా గౌఫ్ దే పై చేయిగా నిలిచింది.