హెలికాఫ్టర్ క్రాష్.. మరణానికి ముందు బ్రియాంట్‌ చేసిన చివరి కామెంట్!

By Prashanth MFirst Published Jan 27, 2020, 12:53 PM IST
Highlights

బాస్కెట్ బాల్ లెజెండ్ ప్లేయర్ కోబె బ్రియాంత్ ఆకస్మిక మరణం ప్రపంచాన్ని కదిలించింది. హెలికాప్టర్ లో కూతురితో చేసిన ప్రయాణం చివరి ప్రయాణంగా మిగలడం అమెరికా ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

అమెరికన్ బాస్కెట్ బాల్ లెజెండ్ ప్లేయర్ కోబె బ్రియాంత్ ఆకస్మిక మరణం ప్రపంచాన్ని కదిలించింది. హెలికాప్టర్ లో కూతురితో చేసిన ప్రయాణం చివరి ప్రయాణంగా మిగలడం అమెరికా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఆదివారంనాడు జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు అయితే కోబె బ్రియాంత్ చివరగా చేసిన ట్వీట్ ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది.

బ్రియాంట్ మృతి: కోహ్లీ, రోహిత్, కేటీఆర్ దిగ్భ్రాంతి, ట్రంప్, ఒబామా సైతం...

2016లోనే ఈ దిగ్గజ ఆటగాడు బాస్కెట్‌బాల్‌ కి వీడ్కోలు పలికాడు. అయితే అమెరికా నేషనల్‌ బాల్ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) ప్రొఫెషనల్‌ లీగ్‌ లో  మొత్తం కేరీర్ ని లాస్‌ ఏంజెల్స్‌ లేకర్స్‌ కే అంకితం చేశాడు. అయితే బ్రియాంట్‌ ని ఈ లీగ్ లో అధిగమించిన  లీబ్రాన్‌ జేమ్స్‌ పై ఇటీవల బాగా క్రేజ్ అందుకున్నాడు.   లీబ్రాన్‌ జేమ్స్‌ పై బ్రియాంట్‌  సైతం ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ట్వీట్ చేశాడు.

Continuing to move the game forward . Much respect my brother 💪🏾 #33644

— Kobe Bryant (@kobebryant)

తన రికార్డ్ ని అధిగమించిన బ్రదర్ కి బెస్ట్ విషెస్ అందిస్తున్నా. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని కోరుకుంటున్నట్లు బ్రియాంట్‌ తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే అదే అతనికి చివరి ట్వీట్ కావడం అందరిని షాక్ కి గురి చేసింది. ఎవరు ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా బ్రియాంట్‌ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు.

Footages of how ’s helicopter 🚁 crashed in the air that resulted in his death
.
.
. pic.twitter.com/QoZc1LoD56

— Poundstv (@Poundstvv)
click me!