IPL New Teams: ఐపీఎల్ కొత్త ఫ్రాంచెైజీ కోసం ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ హాట్ కపుల్..? ఓ భారీ వ్యాపారవేత్త అండ?

By team teluguFirst Published Oct 22, 2021, 11:41 AM IST
Highlights

IPL New Teams Tender: క్రికెట్ కు బాలీవుడ్ కు విడదీయరాని అనుబంధం ఉంది. నాటి కపిల్ దేవ్ కాలం నుంచి నేటి విరాట్ కోహ్లి దాకా బాలీవుడ్-క్రికెట్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఐపీఎల్ వచ్చిన తర్వాత అది ఇంకాస్త ఎక్కువైంది. 

వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్ (IPL-2022) లో పది జట్లు పోటీ పడతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రెండు జట్లేవో సోమవారం తేలనుంది. ఈనెల 25న అందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నది. ఈ నేపథ్యంలో కొత్త జట్లు (IPL New Reams) ఏమై ఉంటాయా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా, కొత్త ఫ్రాంచైజీల కోసం ప్రపంచంలోని అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United Football club), సీవీసీ పార్టర్న్స్ (CVC Partners) పోటీ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక భారత్ లో కూడా బడా కార్పొరేట్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ మీద కన్నేశారు.

ఇదిలాఉండగా ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి సంబంధించి మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ప్రముఖ బాలీవుడ్ జంట రణ్వీర్-దీపికా పదుకునే (Ranveer singh deepika padukune) లు కూడా కొత్త టీమ్ ను దక్కించుకునే రేసులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇండియాలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త వెనుకఉండి.. దీపికా-రణ్వీర్ లతో కొత్త ఫ్రాంచైజీ ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడని తెలుస్తున్నది. 

ఇది కూడా చదవండి: IPL New Teams Tender: ఐపీఎల్ పై కన్నేసిన మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్.. పోటీ పడుతున్న మరో 15 సంస్థలు..?

ఐపీఎల్ లో ఫ్రాంచైజీలను బాలీవుడ్ తారలు దక్కించుకోవడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), పంజాబ్ సూపర్ కింగ్స్ (Punjab super kings), రాజస్తాన్ రాయల్స్ (Rajastan Royals)జట్ల యజమానులు బాలీవుడ్ తారలే. బాలీవుడ్ (Bollywwod) బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh khan), ఆయన స్నేహితురాలు జూహీ చావ్లా.. కోల్కతా యజమానులు కాగా సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా పంజాబ్ జట్టులో పెట్టుబడులు పెట్టింది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు రాజస్తాన్ రాయల్స్ లో పెట్టుబడులున్నాయి. ఒకవేళ ఐపీఎల్ లో కొత్త జట్టును దీపికా-రణ్వీర్ చేజిక్కించుకుంటే ఐపీఎల్ కు మరింత గ్లామర్ జతకలవనున్నది. 

దీపికా, రణ్వీర్ లు క్రీడలతో మమేకమవడం కూడా కొత్తేం కాదు. దీపికా తండ్రి ప్రకాశ్ పదుకునే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన గతంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఇక రణ్వీర్ సింగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తో చేతులు కలిపాడు. అంతేగాక వరల్డ్ మోస్ట్ పాపులర్ లీగ్ ఎన్బీఏ (NBA) కు అతడు బ్రాండ్ అంబాసిడర్. వీటితో పాటు క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 83 సినిమాలో రణ్వీర్.. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండటం గమనార్హం. 

click me!