ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుమారివాలా

By Siva KodatiFirst Published Aug 27, 2022, 9:42 PM IST
Highlights

ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడిగా మాజీ ఒలింపియన్ ఆదిల్ జె సుమారివాలా ఎన్నికయ్యారు. ఐవోఏ రాజ్యాంగంలోని క్లాజ్ 11.1.5 ప్రకారం.. 31 మందిలో 18 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం ప్రకారం ఐవోఏ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. 

ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడిగా మాజీ ఒలింపియన్ ఆదిల్ జె సుమారివాలా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగే వరకు ఆయనే ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ శనివారం తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి పంపిన లేఖలో.. సుమారివాలా ఇలా వ్రాశారు. ‘‘ఐవోఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ ధ్రువ్ బాత్రా వ్యక్తిగత కారణాల వల్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పదవికి జూలై 18న రాజీనామా చేశారు. దీంతో ఈ పదవి ఖాళీ అయ్యింది. ఐవోఏ రాజ్యాంగంలోని క్లాజ్ 11.1.5 ప్రకారం.. 31 మందిలో 18 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం ప్రకారం ఐవోఏ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. 

ఈ విషయంపై ఆదిల్ జె సుమారివాలా మాట్లాడుతూ IOA అధ్యక్ష పదవిని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. మెజారిటీ సభ్యులచే  ఈ నిర్ణయం ఆమోదించబడిందన్న ఆయన.. తనపై విశ్వాసం ఉంచిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో ఒలింపిక్స్‌ ప్రచారానికి తాను ఎప్పుడూ కృషి చేస్తానన్న సుమారివాలా..  IOAకి కొత్తగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు చేపట్టే వరకు క్రీయాశీలకంగా పనిచేస్తానని చెప్పారు. ఈ పరిణామం భారతీయ క్రీడలకు కూడా మంచిదన్న ఆయన.. భారతీయులు  పలు అంతర్జాతీయ స్థానాలను స్వీకరించారని గుర్తుచేశారు.  

ఇకపోతే.. సుప్రీంకోర్ట్ ఐవోఏకి ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హైకోర్ట్ నియమించిన ముగ్గురు సభ్యులు సీవోఏ నేషనల్ స్పోర్ట్స్ అపెక్స్ బాడీకి బాధ్యత వహించదని చెబుతూ.. యథాతథ స్థితిని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది. గత నెలలో ఎన్నికలను త్వరగా నిర్వహించడంలో విఫలమైతే ఐవోఏని సస్పెండ్ చేస్తామని.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెచ్చరించింది. నిజానికి ఐవోఏ ఎన్నికలు గతేడాది డిసెంబర్‌లోనే జరగాల్సి వుండగా.. రాజ్యాంగ సవరణల కారణంగా ఎన్నికలు జరగలేదు. దీంతో జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలస్యం లేకుండా ఎన్నికల తేదీని నిర్ధారించాలని ఐవోఏని ఐవోసీ కోరింది. 

click me!