వివాహ పంచమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

By Shivaleela Rajamoni  |  First Published Dec 15, 2023, 4:07 PM IST

Vivah panchami 2023: శ్రీరాముడు, సీతాదేవిల వివాహ వార్షికోత్సవాన్నే మనం వివాహ పంచమీగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మార్గశిర్ష మాసం శుక్ల పక్షం ఐదో రోజున వివాహ పంచమి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి వివాహ పంచమి డిసెంబర్ 17న వచ్చింది. ఇంతటి పవిత్రమైన రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 


Vivah panchami 2023: సనాతన ధర్మంలో వివాహ పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాముడు, సీతాదేవిల వివాహ వార్షికోత్సవాన్ని వివాహ పంచమిగా జరుపుకుంటారు. అందుకే  ప్రతి ఏడాది మార్గశిర్ష మాసంలోని శుక్ల పక్షం 5వ రోజున వివాహ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈసారి వివాహ పంచమి డిసెంబర్ 17న ఉంది.ఈ రోజు  శ్రీరాముడి వివాహాన్ని నిర్వహించడం వల్ల జీవితంలో మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్మకం ఉంది. అలాగే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. 

వివాహ పంచమి నాడు కొన్ని పనులు చేయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వివాహ పంచమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos

undefined

వివాహ పంచమి నాడు ఏం చేయాలి?

  • సీతా రాముల వివాహాన్ని వివాహ పంచమి సందర్భంగా నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  • వివాహ పంచమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి.
  • వివాహ పంచమి నాడు పెళ్లికాని అమ్మాయిలు జానకీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
  • ఈరోజున ఉపవాసం ఉండాలి. 
  • అలాగే భజనలు, కీర్తనలు చేయాలి.
  • నిరుపేదలకు భక్తిశ్రద్ధలతో అన్నదానం చేయాలి. 

వివాహ పంచమి నాడు ఏం చేయకూడదు

  • వివాహ పంచమి నాడు తామాసిక ఆహారాన్ని తీసుకోకూడదు.
  • ఈ రోజు ఎవరినీ కించపరచకూడదు.
  • జీవిత భాగస్వామితో గొడవ పడకూడదు.
  • అలాగే అసభ్యకరమైన మాటలను మాట్లాడకూడదు. 
  • ఎవరినీ దూషించకూడదు.

వివాహ పంచమి నాడు పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

వివాహ పంచమి నాడు సీతారాముల వివాహ కథను వినడం లేదా చదవడం వల్ల సీతారాముల అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. పూజ చేసేటప్పుడు సీతాదేవికి గాజులు, కుంకుమ, బొట్టు, మెహందీ వంటి వస్తువులను సమర్పించాలి. దీనివల్ల మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం ఉంది. 
 

click me!