1 అక్టోబర్ 2021 శుక్రవారం, దశమి రోజు బొడ్డెమ్మ పండగ, మొదటి బతుకమ్మ "ఎంగిలి పూల బతుకమ్మ" ను పేరుస్తారు.
* 1 అక్టోబర్ 2021 శుక్రవారం, దశమి రోజు బొడ్డెమ్మ పండగ, మొదటి బతుకమ్మ "ఎంగిలి పూల బతుకమ్మ" ను పేరుస్తారు.
undefined
* రెండవ బతుకమ్మ " అటుకుల బతుకమ్మ" :- 6 అక్టోబర్ 2021 బుధవారం, మహాలయ అమావాస్య రోజు... తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
* మూడవ బతుకమ్మ " ముద్దపప్పు బతుకమ్మ" :- 7 అక్టోబర్ 2021 గురువారం, ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.
* నాల్గవ బతుకమ్మ " నానబియ్యం బతుకమ్మ " :- 8 అక్టోబర్ 2021 శుక్రవారం, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
* ఐదవ బతుకమ్మ " అట్ల బతుకమ్మ " :- 9 అక్టోబర్ 2021 శనివారం, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
* ఆరవ బతుకమ్మ " అలిగిన బతుకమ్మ" :- 10 అక్టోబర్ 2021 ఆదివారం, ఈ రోజు నైవేద్యం సమర్పించరు.
* ఏడవ బతుకమ్మ " వేపకాయల బతుకమ్మ" :- 11 అక్టోబర్ 2021 సోమవారం, బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
* ఎనిమిదవ బతుకమ్మ " వెన్నముద్దల బతుకమ్మ " :- 12 అక్టోబర్ 2021 మంగళవారం, నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.
* తొమ్మిదో రోజు " సద్దుల బతుకమ్మ " :- 13 అక్టోబర్ 2021 బుధవారం, ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.
ముఖ్యగమనిక :- ఈ పండగకు ప్రాంతాల వారికి భేదాభిప్రాలు ఉన్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151