2020లో ఆఖరి సూర్యగ్రణం నేడు..!

By telugu news teamFirst Published Dec 14, 2020, 9:58 AM IST
Highlights

ఈ గ్రహణం ఈ రోజు సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలై.. రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు ఉండనుంది.

ఈ ఏడాది 2020లో చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14వ తేదీన సంభవించనుంది. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రహణం వృశ్చిక, మిథున రాశులలో సంభవించనుంది. అయితే.. భారత్ లో ఈ గ్రహణం కనిపించనందున ఇక్కడ దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కాగా.. ఈ గ్రహణం ఈ రోజు సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలై.. రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు ఉండనుంది.

ఈ గ్రహణం దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, అంటార్కిటికాలో కనిపించనుంది. 2020లో రెండు సూర్య గ్రహణాలు సంభవించాయి. రాబోయే ఏడాది 2021లో కూడా రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. 2021లో మొదటి సూర్యగ్రహణం జూన్ 10న ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, గ్రీన్ ల్యాండ్, రష్యాలలో కనిపించనుంది. భారత్‌లో పాక్షికంగా కనిపించనుంది. 2021లో రెండో సూర్యగ్రహణం డిసెంబరు 4న ఏర్పడనుంది. ఇది అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలలో కనిపించనుంది.
 

click me!