ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా ఆరాధన చేయాలి. గుడి దగ్గర ఉన్న రావి చెట్టుకు "11" ప్రదక్షిణలు నిదానంగా తిరుగుతూ 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటూ స్మరించుకోవాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
భావము:- మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.
undefined
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా ఆరాధన చేయాలి. గుడి దగ్గర ఉన్న రావి చెట్టుకు "11" ప్రదక్షిణలు నిదానంగా తిరుగుతూ 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటూ స్మరించుకోవాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. ప్రమిద భూమిపై పెట్టకుండా రావి ఆకు వేసి దానిపై పిండితో తయారు చేసిన దీపాన్నిపెట్టి కుంకుమ, పూలతో అలంకరించి వెలిగించాలి. ఇందులో సూచించినట్లుగా పిండితో చేసిన ప్రమిదలో కొంచం బెల్లం వేసి దానిపై వత్తి వేసి నునే పోసి పూజ చేయాల్సి ఉంటుంది.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
భావము:- ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151