గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం

Published : Oct 15, 2020, 11:05 AM IST
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం

సారాంశం

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.   

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది.
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. 
దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. 

గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. 
శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. 

గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.

* కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకునే సాంప్రదాయం ఉంది.

* గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి గుడ్డలో గవ్వలను కడతారు. అలా చేయటం  వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని భావన చెందుతారు. 

*  గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది అని ఓ నమ్మకం. 

* వ్యాపారులు  గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులుకు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం ఉంది. 

* వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి అని కొందరి అభిప్రాయం.
 
* వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు విశ్వసిస్తారు. 

* గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక నమ్మకం.

* పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కడతారు. 

PREV
click me!

Recommended Stories

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!