దేవి నవరాత్రులలో ఐదవ రోజు సరస్వతి పూజ అవతారం - దద్ధోజనం

By telugu news teamFirst Published Oct 11, 2021, 9:07 AM IST
Highlights

దేవి నవరాత్రులలో ఐదవ రోజు సరస్వతి పూజ అవతారంగా కొలుస్తారు. అమ్మవారికి నివేధనగా దద్ధోజనం సమర్పిస్తారు. 
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

దేవి నవరాత్రులలో ఐదవ రోజు సరస్వతి పూజ అవతారంగా కొలుస్తారు. అమ్మవారికి నివేధనగా దద్ధోజనం సమర్పిస్తారు. 


పెరుగన్నం "దద్ధోజనం"  తయారు చేయుటకు కావలసిన పదార్ధములు  :-

బియ్యం 1/4 కిలో

పాలు 1/2 లీటరు 

చిక్కటి పెరుగు 1/2 లీటరు

నూనె 1/2 కప్పు

నెయ్యి 1 స్పూన్

కొత్తమిర , కర్వేపాకు

చిన్న అల్లం ముక్క

పచ్చిమిర్చి

పోపు సామాగ్రి

జీడిపప్పు 20

ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి

* దద్ధోజనం చేసే విధానం :- 

ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,

సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తమిర, కోరిన అల్లం..  అన్నీరెడిగా ఉంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి ఉంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి కాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీ వేయండి.  రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.

click me!